సామాజిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సామాజిక లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18 మార్చి 2018

ఉగాది శుభాకాంక్షలు

ఉప్పులాంటి భయాన్ని ,
కారం లాంటి కోపాన్ని,
పులుపు  లాంటి ఇబ్బందులను,
చేదులాంటి గతాన్ని  మరచి ,
మామిడిలాంటి నూతనోత్సోహంతో
తీపిలాంటి జీవితాన్ని ఆశ్వాదించాలనేదే  "ఉగాది పచ్చడి" అర్థం.

చేదు అనే గతాన్ని మర్చిపోయి, తీపి అనే భవిష్యత్తు కోసం
నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలని,
పర్యావరణంలో కొత్తదనాన్ని తీసుకురాడమే  ఉగాది పండుగ పరమార్థం.

బంధు మిత్రులు అందరికి మంచి జరగాలని కోరుకుంటూ..
విళంబి నామ తెలుగు నూతన సంవత్సరాది నూతన సంవత్సర శుభాకాంక్షలు
తో..

మీ మిత్రుడు...
శ్రేయోభిలాషి..

25 మార్చి 2017

This Day - That Day - Live Everyday not just a single day

I do not understand the Days? Why we need to count them on? Why not we make them countable everyday?

Birthday - Why you have to wait for a day in year or 4 years to celebrate that you are alive? Why can't you celebrate everyday, every moment?
Does a reason is required to be happy?
Father's Day/Mother's Day/Parents Day - Are you not grateful to your parents for entire life as they gave you the life? Do you have only one day in a year to show your love to them? Don't you feel ashamed of it?
Water Day/Air Day/Earth Hour - Don't you have responsibility to save all the natural resources for the next generation? You will hold a Play-card with message and take selfie to post it on a social networks, is this the SOCIAL responsibility? Why can't you save Power/Natural resources from going useless or getting polluted Everyday/Every hour??
Friendship day - Can you breath only on a particular day in a year by living entire year without breathing? This is also same way, you have to celebrate friendship everyday every moment. Does one day is enough to thank them for being in the beautiful or hard times with you?
Women's Day - Can you imagine your life without Woman, Be she is Mother/Sister/Friend/Teacher or any? Why can't we respect them everytime anytime? Can Men or Women came on earth to live like Poles away from each other? without respecting each other?
Heart Day/Liver Day/Kidney Day/Pink Day/Cancer Day - Do you think working out on a single day will help you to live/die healthy? Isn't it funny? You have to work out everyday to keep yourself healthy and fit.
AIDS Day - do you wear protection on aids day only to be away from it?

What we have to do is make small habits which bring big change in the life, not taking selfies and posting or commenting on social networks.

Respect means understanding, thanking for being in the moments with us.
Lets learn to Respect People/Life/Natural resources/Health to keep them with us and pass them to next forever.

Small habits makes Big personality
Big Personality achieves bigger Dreams.

So make good small habits.

28 జనవరి 2017

కొట్టుకుచావండి కొడుకుల్లారా !!

నా ఈ కొత్త కవిత ,
రాజకీయ పక్షం/కులం/అభిమానం అని చెప్పుకుంటూ ఆలోచన లేకుండా facebook /twitter /youtube లో కొట్టుకు/తిట్టుకు చస్తున్న  పశువుల మెదడున్న చేవలేని వెన్నెముక లేని ఈనాటి యువత మీద...........

ఓ యువకులారా!!

విషయాల మీద అభిప్రాయం లేదు మీకు
మనుషుల మీద తప్ప

స్పష్టమైన ఆలోచన లేదు మీకు
అనుకరించే గుడ్డితనం తప్ప

పౌరుషం అంటే తెలియదు మీకు
కొట్టుకు/తిట్టుకోవడం తప్ప

ఎంత చదివిన ఎదగలేదు మీరు
అడ్డదిడ్డంగా వాదించడం తప్ప
--------------------------------------------------------

కొట్టుకుచావండి కొడుకుల్లారా !!
కొట్టుకుచావండి!!

కులమంటూ , మతమంటూ 
మానవత్వమే లేదంటూ 

కొట్టుకుచావండి కొడుకుల్లారా !!
కొట్టుకుచావండి!!

నటుడంటూ, నాయకుడంటూ 
అభిమానివై , కార్యకర్తవై 

వాడు చెప్పిందే నిజమంటూ 
వీడు చేసిందే ధర్మమంటూ 

విచక్షణ జ్ఞానం లేకుండా 
అనుక్షణం మద్దతిస్తూ 

కొట్టుకుచావండి కొడుకుల్లారా !!
కొట్టుకుచావండి!!

మెదడును మూలన పడేసి,
నోరును బజారున పడేస్తూ

హృదయాన్ని దాచి, 
చేయిజేసుకుంటూ 

ఓపికలేని యంత్రాల్లా 
మత్తు ఎక్కినా కోతుల్లా 
మదమెక్కిన ఏనుగుల్లా 

కొట్టుకుచావండి కొడుకుల్లారా !!
కొట్టుకుచావండి!!

12 జూన్ 2015

కోట్ల కోసం ఒకరు, నోట్ల కోసం మరొకరు - kotla kosam okaru, notla kosam marokaru

కోట్ల కోసం ఒకరు, నోట్ల కోసం మరొకరు
కూటికొరకు పరుగెత్తే వాణ్ని పట్టించుకునేదెవ్వరు?

kotla kosam okaru, notla kosam marokaru
kootikoraku parugetthe vaanni pattinchukunedevvaru

ఇది మన దౌర్భాగ్యం - Idi mana Dhowrbhagyam

ఆ పార్టీ ఈ పార్టీ
కాదేది అవినీతికనర్హం

ఈ పత్రిక ఆ టీవీ
అంతా నాటకీయం

ఆ వార్త ఈ వివరణ
అన్నీ డబ్బుమయం

వాళ్ళ పత్రిక వీళ్ళ టీవీ
డప్పు కొట్టే సంపాదకీయం

మా నాయకుడు మీ నాయకుడు
అభిమానించే మూర్ఖత్వం

చదువుకున్న వాళ్ళు కూడా
ఆలోచించని దౌర్భాగ్యం

aa party ee party
kaadedi avineethikanarham

ee patrika aa tv
antha naatakeeyam

aa vaartha ee vivarana
annee dabbumayam

vaalla patrika veella tv
dappu kotte sampaadakeeyam

maa naayakudu mee naayakudu
abhimaaninche mookhatwam

chaduvukunna vaallu kooda
aalochinchani dhowrbhagyam

30 జనవరి 2015

పరితరణ రూపకర్త జీవితం - Software Engineer life

జీతం
లక్షల్లో కనపడుతుంది
వందల్లో మిగులుతుంది

పెళ్లి 
అమ్మాయిలూ జీతం లక్షల్లో కావాలంటారు
పొట్ట ముందుకు రాకూడదు
తలపై జుట్టు వెనక్కి పోకూడదు

కష్టం
చెమట చుక్కైనా పట్టదు
కాని రక్తపు బొట్టు కూడా మిగలదు

తిండి
పిజ్జాలు తింటే కడుపు నిండదు
తిన్నతి రొంత అరిగిచావదు

ఎక్కువ తింటే అజీర్తి
తక్కువ తింటే అసిడిటీ

ప్రపంచం
ప్రపంచంత స్నేహితులు
పక్కింట్లో అపరిచితులు

ఆదాయం
ఆదాయం గోరంత
ఆశలు కొండంత

కొనడం
అవసరమున్నప్పుడు  కాదు
తగ్గింపు ( రాయితీ ) ఉన్నప్పుడు కొంటారు

ఆనందం
మందు తాగడం
మత్తులో తూగడం

సమయం
మనుషులతో కన్నా
యంత్రాలతో ఎక్కువ గడుపుతారు

అప్పు
ఇంటినిండా సామాన్లు
ప్రతిదానిపై అప్పులు


గమనిక:  ఇవన్నీ అందరూ చేయాలనీ కాని   అందరూ అలా చేస్తారని కాదు వారు అల అలవాటు పడిపోయారని వ్యంగంగా రాయడమైనది 

16 జనవరి 2015

ప్రశ్నిస్తే పోయేదేమీ లేదు వస్తే సమాధానం తప్ప - Question is our weapon

ప్రశ్నిస్తే పోయేదేమీ లేదు వస్తే సమాధానం తప్ప - Question is our weapon
ప్రశ్నిస్తే పోయేదేమీ లేదు వస్తే సమాధానం తప్ప.

ప్రశ్నించు ప్రశ్నించు
అబద్దం అలసిపోయేవరకు,
నిజం తెలిసే వరకు.

ప్రశ్నించు ప్రశ్నించు
నాయకులు మారేవరకు,
ప్రజలు పోరాడేవరకు.

ప్రశ్నించు ప్రశ్నించు
అవినీతి కాలిపోయేవరకు,
నీతిగా పనులు జరిగేవరకు.

ప్రశ్నించు ప్రశ్నించు
భయం పారిపోయేవరకు,
ధైర్యం బలపడేవరకు.

ప్రశ్నించు ప్రశ్నించు
ప్రపంచం మారేవరకు,
ప్రజలకు  జరిగేవరకు.

ప్రశ్నించు ప్రశ్నించు
గొంతు పెకల్చి, చేయి ఎత్తి,
నడుము కట్టి, పిడికిలి బిగించి.

ప్రశ్నించు ప్రశ్నించు
ప్రశ్ననే నీ ఆయుధమై,
నిజమే నీ లక్ష్యమై,

ప్రశ్నించు ప్రశ్నించు
ప్రతి కన్నీటి బొట్టుకి న్యాయం జరిగేవరకు. 
ధర్మం నడిచేవరకు
మంచి గెలిచేవరకు

ప్రశ్నించు ప్రశ్నించు
నీ చివరిమాట వరకు
నీ తుదిశ్వాస వరకు

14 జనవరి 2015

భోగి మకర సంక్రాంతి కనుమ - Bhogi Makara Sankranthi Kanuma

భోగి మకర సంక్రాంతి కనుమ - Bhogi Makara Sankranthi Kanuma
పంటలు నిండిన గానుగలు,
బంధువులు నిండిన ఇల్లు,

చలిని చీల్చుతూ,
బాధలను మరిపిస్తూ,
గతాన్ని కాలరాస్తూ,
కొత్త  ఉత్తేజాన్నిచ్చే భోగి మంటలు.

గొబ్బెమ్మలు నిండిన ముగ్గులు,
రంగురంగుల ముగ్గులు నిండిన వీధులు,
జీవితం హరివిల్లులా ఉండాలని చూపించే వీధులు.

కన్నుల పండుగగా నిలచె కనుమ.
సంతోషం, సంతృప్తి తో నిండిన రైతుల మనసులు...

నోరూరించే మిఠాయిలు,
ఘుమఘుమలాడే వంటకాలు.
రెపరెపలాడే గాలి పటాలు,

వాతావరణంలోనే కాక జీవితంలో కూడా మార్పులు తెచ్చే పండుగ మకర సంక్రాంతి...

త్వరలోనే మళ్ళీ ప్రతియేటా రైతులందరూ సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటారని ఆశిస్తూ ...
మీకు మరియు మీ కుటుంభ సభ్యులకు భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు

స్తితిగతి మార్చండి పేరును కాదు..change fate of area not its name

అయ్యా!! బాలయ్య గారు మరియు మిగతా రాజకీయనాయకులు,
మిమ్ములను ఎన్నుకున్నది మా ప్రాంతాలకు పేర్లు మార్చమని కాదు, మా ప్రాంతాల స్థితిగతులను మార్చమని. 
మీరేమో అనంతపురం జిల్లా ఏమి చేయాలో ఆలోచించడం మానేసి జిల్లాని ఎలా విడగొట్టాలి, విడగొట్టి వాటికి మా నాన్న పేరు ఎలా పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. 
హిందూపురం నుండి మీ నాన్న గారు, మీ అన్న గారు ఇప్పుడు మీరు ఎన్నికయ్యారు ఎం లాభం అప్పుడెల ఉందొ ఇప్పుడు అలానే ఉంది. మీరు అభివృద్ధి, సమస్యల పరిష్కారం పట్టించుకోకుండా ఇలా నామకరణం మీద ఎందుకు శ్రద్ధ చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. 
మంచి చేస్తే ప్రజల గుండెల్లో ఉంటారు దానికోసం ఊరిపేర్లు మార్చక్కర్లెదు... కావాల్సివస్తే ప్రజలే కోరుకుంటారు. 
అనవసరంగా మీరు కూడా యు.శ్రా.రై  (వైయస్ఆర్ పార్టీ ) రాజకీయ పక్షం లాగ తల్లిదండ్రుల పేరును ఒక వస్తువులా  ప్రచారం/వ్యాపారం చేయోద్దండి. 


మీరు ఈ పై అంశాల గురించి ఆలోచిస్తారని ఆశిస్తూ,
విశ్వనాధ్
మీరేదో మంచి చేస్తారని ఆశించి ఓటు వేసిన సామాన్యుడు.


13 జనవరి 2015

ఆంధ్రప్రదేశ్ రాజధాని - పారదర్శకత - Transparency in AndhraPradesh capital city construction

మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు,

1. ప్రధాని నరేంద్రమోడి గారు "భారత్ లో తయారీ " అని ఒకపక్క ప్రయత్నిస్తుంటే,మీరు ఈ సువిశాల భారత దేశంలో ఎవరూ రాజధాని నిర్మించాలేరని సింగపూర్ వారినే ఎందుకు రాజధాని నిర్మించమని అడుక్కున్తున్నారో మాకు అర్థం కావట్లే? ప్రపంచానికే సాంకేతికతను అందిస్తున్న ఈ భారత దేశం ఎందుకూ  పనికిరాద?

2. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం సింగపూరు ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం వివారాలు వేల్లదిన్చాకపోవడమెనా?
రాజధాని ప్రణాళిక కోసం మొత్తం ఎంత డబ్బు చెల్లిస్తున్నారు సింగపూర్ కి ?
లేదంటే అంతే విలువైన ప్రయొజనాలెమైన కేటాయిస్తున్నారా ?
ఇవన్నీ ప్రజలకు తెలపకపొవడమేనా  పారదర్శకత అంటే?

ప్రతిపక్ష నేత జగన్ గారు,

ముఖ్యమంత్రి గారు అవన్నీ చేస్తుంటే మీరు ఓదార్పు యాత్రలు చేస్తూ ఉండడమేనా లేక ఏమైనా పద్దతిగా నిలదీసేదేమైన ఉందా?

మీరు ఈ పై అంశాల గురించి ఆలోచిస్తారని ఆశిస్తూ,
విశ్వనాధ్
మీరేదో మంచి చేస్తారని ఆశించి ఓటు వేసిన సామాన్యుడు.

01 జనవరి 2015

ఈ కాలపు యువత - Todays Youth

ఈ కాలపు యువత..

మత్తులో తేలుతూ
వీధుల్లో తూలుతూ
పిచ్చిపిచ్చిగా రంకలేస్తూ
జల్సాలకు బానిసలై

అవినీతికి తలవంచే
అన్యాయానికి ఆయుధమయ్యే
రాజకీయాలకు బలయ్యే
హత్యా,అత్యాచారాలలో ఇరుక్కునే

ఆరోగ్యం పై శ్రద్దలేని
ఆలోచలనల్లో స్పష్టతలేని
ఆచరణల్లో మార్పులేని
కళ లేని, కల లేని
అవకాశాలు అందుకోలేని

వీళ్ళా? నా ఈ దేశాన్ని మార్చేది ?
వీళ్ళా? నా ఈ ప్రపంచాన్ని నడిపించేది?

06 సెప్టెంబర్ 2014

మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు - Our beloved cheif minister of AndhraPradesh

మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరియు ప్రతిపక్ష నేత జగన్ గారు,
  1. అభివృద్ధి అంటే పరిశ్రమలు స్తాపించాడమేనా ? మరి వ్యవసాయం అక్కరలేదా?
  2. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయక్కర్లేదా?
  3. కృష్ణా నది చుట్టూ రాజధాని ని నిర్మిస్తే ఆ నీరు కలుషితం అయి మరో మూసినది తయారవ్వదని చెప్పగలరా?
  4. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వ్యవసాయ రాజధాని అయిన కృష్ణా-గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని స్థిరాస్థి కోసం అమ్ముకోమంటార?
  5. వ్యవసాయానికి నీరులేని చోట ఆధునీకర పద్దతులు అవలంబిస్తారు సరే మరి నీరు పుష్కలంగా ఉన్న చోట వ్యవసాయం ఎందుకు మానేయాలి? ఇది ఎంతవరకు న్యాయం ?
  6. రాజధాని కోసం వేసిన కమిటీ సూచనలు పట్టించుకోనప్పుడు, ప్రజల సొమ్ముతో అలాంటి కమిటీలు వేయడం ఎందుకు? వాటిలో మేధావులను నియమించడం ఎందుకు? ఇది ద్రవ్య లోటు తో ఉన్న రాష్ట్రానికి ఇంకా నష్టం కాదా?
  7. అనంతపురం, కర్నూల్ వంటి జిల్లాలలో ప్రభుత్వ/దేవాదాయ శాఖ భూములు ఎక్కువ ఉన్నప్పుడు వాటినెందుకు రాజధాని కోసం పరిశీలించరు?
  8. సింగపూర్/వాషింగ్టన్/ స్మార్ట్ సిటీ /మెగా సిటీ లంటూ పరాయిదేశాల పడడమేనా మనం సొంతంగా ఏమిన సాదించేది కనిపెట్టేది ఉందా?
  9. ద్రవ్య లోటు/రాజధాని కోసం చందాలు అంటూనే కోట్లకుకోట్లు కుమ్మరించే చిత్ర నిర్మాతలకు రైతుల భూములను అప్పనంగా ఇవ్వడం ఎంతవరకు సబబు?
మీరు ఈ పై అంశాల గురించి ఆలోచిస్తారని ఆశిస్తూ,
విశ్వనాధ్
మీరేదో మంచి చేస్తారని ఆశించి ఓటు వేసిన సామాన్యుడు.

24 జూన్ 2014

vivaaham vivaahabandham

రెండు మనసుల అనుబంధం
రెండు కుటుంభాల సంభంధం

ఏడడుగుల బంధం
ఏడూ జన్మల అనుబంధం

అదే వివాహబంధం.............

అక్క వివాహం

మామిడి తోరణాలు
పచ్చని పందిళ్ళు

ప్రముఖుల రాకలు
టపాసుల తపటపలు

వంటల ఘుమఘుమలు
భజంత్రీల గలగలలు

పిల్లల అల్లర్లు
పెద్దల ముచ్చట్లు

పెళ్ళికూతురి అప్పగింతలు
పెళ్ళికొడుకు బాధ్యతలు

అదే వివాహ వేడుక..

02 అక్టోబర్ 2013

Neetho prayanam anthuleni aanandam - నీతో ప్రయాణం అంతులేని ఆనందం

పంట పొలాల్లో లేగదూడలా,
అడవిలో లేడిపిల్లలా,
నడక నేర్చినా పిల్లలా,
కొండను చీల్చుకుంటూ,
పొలాల్లో పరిగెడుతూ,
నాగుపాములా వయ్యారంగా,
నెరజాణలా సుతారంగా,
ధూమపానం సేవిస్తూ,
మనమ్స్శాన్తిని అందిస్తూ,
ప్రపంచాన్ని చూపిస్తూ,
అమ్మలా జోలపాడుతూ,
గమ్యం చేర్చే ధూమశకటమా,
నీతో ప్రయాణం అంతులేని ఆనందం

21 జులై 2013

ఆత్మవిశ్వాసం ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యమే- if you have Self confidence nothing can stop you

if you have Self confidence nothing can stop you - ఆత్మవిశ్వాసం ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యమే
అన్నీ బాగున్న  వాళ్ళే ఆత్మస్థైర్యం లేక,
ఆత్మహత్యలను ఆశ్రయిస్తుంటే,
అంగవైకల్యాన్ని జయిస్తూ ఆత్మస్థైర్యాన్ని ఇనుమడింప చేస్తూ,
మన అందరికి  ఆదర్శమవుతున్న  ఆత్మాభిమానపు,ఆత్మవిశ్వాసపు ప్రతిరూపాలకు,
ఇదే  అభినందన,  నమఃపుష్పాంజలి

ఆత్మవిశ్వాసం ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యమే

10 ఏప్రిల్ 2013

Ugadhi ఉగాది - తెలుగు మరియు కన్నడ నూతన సంవత్సర శుభాకాంక్షలతో


తీపి చేదు కలయికే "ఉగాది పచ్చడి",
మంచి చెడుల కలయికే "జీవితం"

చేదు తగిలినా...తీపిని ఆశ్వాదించాలనేదే  "ఉగాది పచ్చడి" అర్థం,
కష్టాల్లెన్ని ఉన్నా ఆనందం కోసం పరిగెడుతూ జీవితాన్ని  ఆశ్వాదించాలనేదే జీవిత పరమార్థం...

అందరికి మంచి జరగాలని కోరుకుంటూ..
తెలుగు మరియు కన్నడ నూతన సంవత్సర శుభాకాంక్షలతో..

మీ మిత్రుడు...
శ్రేయోభిలాషి..

21 ఫిబ్రవరి 2013

ennaalleee edava jeevitham.......ఎన్నాళ్ళీ ఎదవ జీవితం...


బతికినన్నాళ్ళూ గాడిద బతుకు బతుకుతూ,
ఎవడి చేతుల్లో, ఎప్పుడు? ఎలా చస్తామో తెలియక,
చలికి, భయానికి వణుకుతూ,
అయిపొయినదానికి గొణుగుతూ,
జరగబోయేదానికి జంకుతూ,
ఇలానే బతకాలా?
ఇంతకంటే ఏమి చేయలేమా?

11 జనవరి 2013

Don't waste your young age


కన్నెపిల్లకు కన్ను కొట్టే వయసూ ఇదే,
కండలతో కొండను పిండి చేసే వయసూ ఇదే.

వృథా చేయకు మిత్రమా!!!!!!! నీ యవ్వనాన్ని!!!!

kannepillaku kannukotte vayasoo ide,
kandalatho kondanu pindichese vayasoo ide,

vrutha cheyaku mithramaa!! nee yavvanaanni!!!!

03 డిసెంబర్ 2012

దేశ బాషలందు తెలుగు లెస్స - Desha baashlandu telugu lessa

Desha baashlandu telugu lessa - దేశ బాషలందు తెలుగు లెస్స
అమ్మ ప్రేమ కమ్మదనం తెలుగు,
రైతన్న తలపాగా తెలుగు,
కుమ్మరి మట్టివాసన తెలుగు,
జొన్న,రాగి సంగటి రుచి తెలుగు,
పొలాల్లో వినిపించే జానపదం తెలుగు.

వీరబ్రహ్మం కాలజ్ఞానం తెలుగు,
శ్రీకృష్ణదేవరాయ వెలుగు తెలుగు,
తెనాలి తెలివితేటలు  తెలుగు,
కందుకూరి ఆశయం తెలుగు,
పోతన రచన తెలుగు,
మొల్ల కవిత్వం తెలుగు,
వేమన పద్యం తెలుగు,
శ్రీశ్రీ భావం తెలుగు.

మాటలు రాని పసిబిడ్డ ఏడుపు తెలుగు,
పరువాలోలికే  ఆడపిల్ల సిగ్గు తెలుగు,
కండలు తిరిగిన యువకుని అహం తెలుగు,
మగరాయుల పట్టు పంచెకట్టు తెలుగు,
పోగరైన మీసకట్టు తెలుగు,
ఆడపడచుల  పసుపు పారాణి తెలుగు.

పున్నమి వెన్నెల ఆహ్లాదం తెలుగు,
వసంతంలో పక్షుల కిలకిల రావాలు తెలుగు,
పేరంటాళ్ళలో మగువల రాగాలు తెలుగు,
పండుగనాడు పచ్చటితోరణాలు తెలుగు,
రకరకాల రుచులుండే  ఉగాది పచ్చడి తెలుగు,
పోగారుబట్టిన పోట్లగిత్త బలం తెలుగు,
పవిత్రమైన గోమూత్రం తెలుగు.

తేనెలొలుకు మాటలు తెలుగు.
మదినిదోచే ముచ్చటైన బాష తెలుగు.

పరబాష జ్ఞానాన్ని సంపాదిద్దాం,
కాని మాత్రుబాష లోనే సంభాషిద్దాం .

తెలుగువాడిగా పుట్టాం,పెరిగాం,
తెలుగు వాడిగానే జీవిద్దాం .

దేశ బాషలందు తెలుగు లెస్స 

17 నవంబర్ 2012

Nandi Hills - నంది కొండలు


మేఘాలు కొండలను ముద్దాడుతుంటే,
ఆకాశం భూమిని హత్తుకుంటుంటే..
పొగమంచు చెవిని తాకుతుంటే..
ఒంటిమీది రోమాలు నిలబడి నాట్యం చేస్తుంటే..
ప్రకృతి అందాలు అలరిస్తుంటే,
జంతువుల అల్లరికి ఒళ్ళు పులకరిస్తుంటే..

అంతకన్నా అందమెక్కడుంటుంది
ఆనందం ఎక్కడ దొరుకుంతుంది...

అదే భూతల స్వర్గం 'నంది కొండలు'