14 మార్చి 2010

ooh priyathama...! aah okka kshanam

ఓ ప్రియతమా...! ఆ ఒక్క క్షణం..................

ఓ ప్రియా !
దొండపండు లాంటి నీ అధరాలతో ,
ముత్యాల్లాంటి పళ్ళతో నువ్వు గలగల నవ్వుతుంటే,
నీ కళ్ళలో ఆనందం నన్ను మైమరిపిస్తుంటే,
నీ చెవి పోగుల శబ్దం నను తాకుతుంటే,
నీ చేతి గాజుల సంగీతం నా మనసును హోరెత్తిస్తుంటే.....
నీ నల్లని కురులు అల్లరి నను కవ్విస్తుంటే...
నీ కాలి మువ్వల సవ్వడి నా మనసులో అలజడి పుట్టిస్తుంటే...
చాలదా ఆ ఒక్క క్షణం నా ఈ జీవితానికి....
చాలదా ఆ ఒక్క క్షణం ఈ ప్రపంచాన్ని మరిచిపోవడానికి...................