18 మార్చి 2010

Aalochinchara Aa Okka Kshanam.......poem on suicides of youngsters

ఆలోచించరా...! ఆ ఒక్క క్షణం.......

I felt very sad and bad after reading the news about the suicides of youngsters in India, in that feeling i wrote this poem. This poem is subjected to the youngsters who are committing for suicides. The theme of the poem is " Think about your parents, friends, teachers, your well wishers for 1 minute before committing for suicide."

Aalochinchara Aa Okka Kshanam.......poem on suicides of youngsters @ Nanoguns9
ఆలోచించరా...! ఆ ఒక్క క్షణం.......
నిన్ను కన్న  తల్లి కోసం
పెంచి పోషించిన తండ్రి కోసం
చదువు చెప్పిన గురువు కోసం
తోడబుట్టిన వాళ్ళ కోసం
చుట్టూ ఉన్న స్నేహితుల కోసం
పుట్టి పెరిగిన  చోటు కోసం
ఆలోచించరా...! ఆ ఒక్క  క్షణం.......
ఏమి సాధించావని చస్తున్నావు....?
ఏమి సాధించాలని చస్తున్నావు...?
చావుతో అన్ని అసాధ్యం
బతికితే ఏదైనా సాధ్యం
చావుతో సాధించలేవు ఏది
నీ తల్లితండ్రుల కన్నీరు తప్ప
చావు తర్వాత లేదురా ఏ జీవితం
జీవిస్తే ఏదైనా సాధ్యం
చరిత్ర తెలిసిన కుర్రవాడా....!
భవిత నీదేనని గుర్తుంచుకో....!
ఆలోచించరా ఆ ఒక్క క్షణం.......
ముందుందిరా జీవితం
తొందరపడకురా ఈ క్షణం
ఈ క్షణంలో తొందరపాటు
నీ సువర్ణ జీవితానికి చేటు..