12 జులై 2011

Who the hell are they to judge telugu people

తెలుగు అన్నదమ్ములను విడదీసేదేవ్వరు,
తెలుగు తెలియని పరాయివాళ్ళా?
తెలుగు నాడిని పట్టేదేవ్వడు,
తెలుగు వాడి అభివృద్దిని ఓర్వలేని వాడా?
తెలుగు వారి మనోభావాలను గౌరవించేదేవ్వరు,
తెలుగుదనం తెలియని విదేశీయులా?
తెలుగు గడ్డను విభజించేదేవ్వరు,
తెలుగు మట్టి వాసనే తెలియని ఇరుపక్కల వారా?
తెలుగు వాళ్లకు న్యాయం చేసేదెవరు,
ఓట్ల కోసం పాకులాడే నాయకులా?
తెలుగు ప్రజలకు నీతి చెప్పేదెవరు,
అవినీతికి పరాకాష్టైన ఆ అధిష్టానమా?
పిల్లులు పూట్లాడుకుంటూ కోతి చెంతకు చేరినట్టు,
రాజకీయనాయకుల దురాలోచనలకు మనం మనం కొట్టుకుంటూ అవకాశవాదుల చెంతకు చేరడం ఎందుకు?

08 జులై 2011

When everything is upside down

Theme: Mental state of a person when he/she feels everything is going wrong and what he/she should do overcome the situation.
When everything is upside down
నిల్చున్న నేలనే కుంగిపోతే,
వెళ్తున్న పడవే మునిగిపోతే,
ఎగురుతున్న విమానమే కూలిపోతే,
సాగుతున్న పయనం ఆగిపోతే,
పరిస్థితులను నిందించక,
పరులను దూషించక ,
కసిగా ముందు సాగేవాడే మనిషి,
గుణపాఠం నేర్పేదే జీవితం.
సముద్రములో కెరటాలు  సాధారణం,
జీవితంలో ఒడిదుడుకులు సర్వసాధారణం.
ఆత్మవిశ్వాసం కోల్పోకు,
భవిష్యత్తు నీదేనని మర్చిపోకు.
ఎగిసిపడే అలవై,
నేలను తాకిన బంతివై,
రగులుతున్న నిప్పువై,
రెట్టింపైన ఆశతో ముందుకు సాగిపో...

07 జులై 2011

I am searching for the happiness

Theme: A feelings of a boy when he is missing his loved one.
నువ్వు నాతో నడిచిన క్షణం పరుగెత్తెను ఆనందం నావెంటే,
నువ్వు వెళ్ళిన ఆ క్షణం నుండి పరుగెత్తక తప్పడం లేదు అందని ఆ ఆనందం వెంట...

నువ్వు విడిచి వెళ్ళిన నాకు,
జగమంత ఒంటరితనం,
విశ్వమంతా శూన్యం,
కళ్ళ నిండుగా అంధకారం,
గొంతు నిండుగా మౌనం,
చలనం లేని శరీరం,
భావాలు లేని మనసు వేదిస్తున్నాయి.
మళ్ళీ నువ్వెప్పుడు కనిపిస్తావనే ఆలోచనతో,
గమ్యమేమిటో తెలియని దారిలో సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నా ఒంటరినై....