మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మరియు ప్రతిపక్ష నేత జగన్ గారు,
విశ్వనాధ్
మీరేదో మంచి చేస్తారని ఆశించి ఓటు వేసిన సామాన్యుడు.
- అభివృద్ధి అంటే పరిశ్రమలు స్తాపించాడమేనా ? మరి వ్యవసాయం అక్కరలేదా?
- వ్యవసాయాన్ని అభివృద్ధి చేయక్కర్లేదా?
- కృష్ణా నది చుట్టూ రాజధాని ని నిర్మిస్తే ఆ నీరు కలుషితం అయి మరో మూసినది తయారవ్వదని చెప్పగలరా?
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే వ్యవసాయ రాజధాని అయిన కృష్ణా-గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని స్థిరాస్థి కోసం అమ్ముకోమంటార?
- వ్యవసాయానికి నీరులేని చోట ఆధునీకర పద్దతులు అవలంబిస్తారు సరే మరి నీరు పుష్కలంగా ఉన్న చోట వ్యవసాయం ఎందుకు మానేయాలి? ఇది ఎంతవరకు న్యాయం ?
- రాజధాని కోసం వేసిన కమిటీ సూచనలు పట్టించుకోనప్పుడు, ప్రజల సొమ్ముతో అలాంటి కమిటీలు వేయడం ఎందుకు? వాటిలో మేధావులను నియమించడం ఎందుకు? ఇది ద్రవ్య లోటు తో ఉన్న రాష్ట్రానికి ఇంకా నష్టం కాదా?
- అనంతపురం, కర్నూల్ వంటి జిల్లాలలో ప్రభుత్వ/దేవాదాయ శాఖ భూములు ఎక్కువ ఉన్నప్పుడు వాటినెందుకు రాజధాని కోసం పరిశీలించరు?
- సింగపూర్/వాషింగ్టన్/ స్మార్ట్ సిటీ /మెగా సిటీ లంటూ పరాయిదేశాల పడడమేనా మనం సొంతంగా ఏమిన సాదించేది కనిపెట్టేది ఉందా?
- ద్రవ్య లోటు/రాజధాని కోసం చందాలు అంటూనే కోట్లకుకోట్లు కుమ్మరించే చిత్ర నిర్మాతలకు రైతుల భూములను అప్పనంగా ఇవ్వడం ఎంతవరకు సబబు?
విశ్వనాధ్
మీరేదో మంచి చేస్తారని ఆశించి ఓటు వేసిన సామాన్యుడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి