23 డిసెంబర్ 2010

Maro Kalala prapanchanni Sadiddam Nava Samaajaanni Nirmiddaam

మరో ప్రపంచం......!



అవినీతి, అసత్యం, మద్యం, డబ్బు ఏలుతున్న ఈ రాజ్యంలో,
అడుగడుగునా దౌర్జ్జన్యం,
ఎటు చూసిన అన్యాయం,
ప్రగతి మాటున పడతి ఫై పెరిగిన దౌర్జ్జన్యాలు,
ప్రతి నిమిషమూ దోచుకోవడం గురించే ఆలోచించే నాయకులు,
ఎప్పుడూ తమ స్వార్థం కోసం విష ప్రచారాలు(ప్రసారాలు) చేసే మాధ్యమాలు,
మానవత్వాన్ని మరిచి చెలరేగి పోతున్న కిరాతకులు,
ఏమి చేయలేక నిరాశ, నిస్పృహలలో ప్రజలు,
పగటి పూట పదిమందిలో స్వేచ్చగా తిరగలేని స్త్రీ, అర్దరాత్రి ఒంటరిగా తిరిగే దెన్నడు?
ఇదేనా శ్రీశ్రీ చెప్పిన మరో ప్రపంచం?
ఇదేనా గాంధీజీ తెచ్చిన స్వాతంత్ర్యం?
ఇదేనా నెహ్రు కలలు కన్న సామ్రాజ్యం?
ఇదేనా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం?
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశించడం వ్యర్థమని తేలిపోయింది,
మరో ప్రపంచం కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమయింది.
అందరం ఒకటిగా పోరాడుదాం,
కలల ప్రపంచాన్ని సాదిద్దాం,
అసలైన ప్రజాస్వామ్యాన్ని స్థాపిద్దాం.
నవసమాజాన్ని నిర్మిద్దాం.