Theme: Reminding the value of time in heart touching manner
వృధా చేయకు మిత్రమా....
విలువైన నీ సమయాన్ని,
కాలరాయకు మిత్రమా
ప్రతి క్షణం జరిగే దేశాభివ్రుద్దిని,
వృధా చేయకు మిత్రమా
మన బవిష్యత్తు కోసం అనుక్షణం శ్రమించే మన తల్లిదండ్రుల ఆసిస్సులను,
ఎపుడూ నీ శ్రేయస్సు కోసం తపించే నీ స్నేహితుల ఆశలను,
వృధా చేయకు మిత్రమా....
మన కోసం సరిహద్దుల్లో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా రేయింబవళ్ళు కాపు కాసే సైనికుల తెగింపుని,
మన కోసం సరిహద్దుల్లో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా రేయింబవళ్ళు కాపు కాసే సైనికుల తెగింపుని,
మనకు మూడు పూటలా తిండి పెట్టడం కోసం రెక్కలు ముక్కలయ్యేలా పని చేసే రైతు కష్టాన్ని,
దేశ దశదిశలను మార్చగలిగే నీ యువ శక్తియుక్తులను,
నీకోసమే ఎదురు చూస్తున్న అవకాశాలను,
మన పెద్దవాళ్ళు తెచిన స్వాతంత్ర్య, స్వేచ్చలను,
మన పూర్వికులు సాధించిన నాగరికతను,
మన సంస్కృతి నేర్పిన పాఠాలను.