02 అక్టోబర్ 2013

Neetho prayanam anthuleni aanandam - నీతో ప్రయాణం అంతులేని ఆనందం

పంట పొలాల్లో లేగదూడలా,
అడవిలో లేడిపిల్లలా,
నడక నేర్చినా పిల్లలా,
కొండను చీల్చుకుంటూ,
పొలాల్లో పరిగెడుతూ,
నాగుపాములా వయ్యారంగా,
నెరజాణలా సుతారంగా,
ధూమపానం సేవిస్తూ,
మనమ్స్శాన్తిని అందిస్తూ,
ప్రపంచాన్ని చూపిస్తూ,
అమ్మలా జోలపాడుతూ,
గమ్యం చేర్చే ధూమశకటమా,
నీతో ప్రయాణం అంతులేని ఆనందం

21 జులై 2013

ఆత్మవిశ్వాసం ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యమే- if you have Self confidence nothing can stop you

if you have Self confidence nothing can stop you - ఆత్మవిశ్వాసం ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యమే
అన్నీ బాగున్న  వాళ్ళే ఆత్మస్థైర్యం లేక,
ఆత్మహత్యలను ఆశ్రయిస్తుంటే,
అంగవైకల్యాన్ని జయిస్తూ ఆత్మస్థైర్యాన్ని ఇనుమడింప చేస్తూ,
మన అందరికి  ఆదర్శమవుతున్న  ఆత్మాభిమానపు,ఆత్మవిశ్వాసపు ప్రతిరూపాలకు,
ఇదే  అభినందన,  నమఃపుష్పాంజలి

ఆత్మవిశ్వాసం ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యమే

10 ఏప్రిల్ 2013

Ugadhi ఉగాది - తెలుగు మరియు కన్నడ నూతన సంవత్సర శుభాకాంక్షలతో


తీపి చేదు కలయికే "ఉగాది పచ్చడి",
మంచి చెడుల కలయికే "జీవితం"

చేదు తగిలినా...తీపిని ఆశ్వాదించాలనేదే  "ఉగాది పచ్చడి" అర్థం,
కష్టాల్లెన్ని ఉన్నా ఆనందం కోసం పరిగెడుతూ జీవితాన్ని  ఆశ్వాదించాలనేదే జీవిత పరమార్థం...

అందరికి మంచి జరగాలని కోరుకుంటూ..
తెలుగు మరియు కన్నడ నూతన సంవత్సర శుభాకాంక్షలతో..

మీ మిత్రుడు...
శ్రేయోభిలాషి..

08 ఏప్రిల్ 2013

Why this Kolaveri...ప్రపంచంలో ఎంతోమంది ఉండగా..


ప్రపంచంలో ఎంతోమంది పెళ్ళికాని అమ్మాయిలుంటారు,
కాని వాళ్ళనెవరినీ నువ్వు ప్రేమించవు..

ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలు నిదానంగా పెళ్లి చేసుకుంటారు..
కాని నువ్వు ప్రేమించిన అమ్మాయే తొందరగా పెళ్లి చేసుకుంటుంది...

21 ఫిబ్రవరి 2013

ennaalleee edava jeevitham.......ఎన్నాళ్ళీ ఎదవ జీవితం...


బతికినన్నాళ్ళూ గాడిద బతుకు బతుకుతూ,
ఎవడి చేతుల్లో, ఎప్పుడు? ఎలా చస్తామో తెలియక,
చలికి, భయానికి వణుకుతూ,
అయిపొయినదానికి గొణుగుతూ,
జరగబోయేదానికి జంకుతూ,
ఇలానే బతకాలా?
ఇంతకంటే ఏమి చేయలేమా?

17 ఫిబ్రవరి 2013

Real Leader........అసలైన నాయకుడు....


Real Leader........అసలైన నాయకుడు....

ఒకడు పదిమందిని వెనకేసు'కొని' ముందు నడిస్తే వాడు నాయకుడు కాడు,
పదిమందిని ముందుండి అభివృద్ధి వైపు నడిపిస్తే వాడు నాయకుడు అవుతాడు.

11 జనవరి 2013

Don't waste your young age


కన్నెపిల్లకు కన్ను కొట్టే వయసూ ఇదే,
కండలతో కొండను పిండి చేసే వయసూ ఇదే.

వృథా చేయకు మిత్రమా!!!!!!! నీ యవ్వనాన్ని!!!!

kannepillaku kannukotte vayasoo ide,
kandalatho kondanu pindichese vayasoo ide,

vrutha cheyaku mithramaa!! nee yavvanaanni!!!!