05 సెప్టెంబర్ 2009

రాజశేఖరా! A Tribute to YS Rajasekhara Reddy

వై యస్ రాజశేఖర రెడ్డి 
రాజశేఖరా........................!

రాజశేఖరా!
నీ మరణ వార్త వినలేక,
ఎర్రని సూర్యుడు,కారు మబ్బుల చాటున దాక్కోనుచున్నాడు.
నీ మరణమును జీర్ణించుకోలేక,
వరుణ దేవుడు కన్నీళ్లు రాల్చుచున్నాడు.
నీవు ఊపిరి వదిలావని తెలిసి,
వాయు దేవుడు ఆగిపోయాడు.
నీవు ఇక పాదం మొపవని తెలిసి,
భూమాత గుండె పగిలి,విలపించుచున్నది.
నీవు ఇక లేవని తెల్సిన,
తెలుగు ఆడపడుచుల హృదయము తల్లడిల్లుచున్నది.
నీవు ఇక మాట్లడవని తెలిసి,
విధాన సభ,నిద్ర నటించుచున్నది
నీ రాజసము ఇక కనిపించదని తెలిసి,
ఎప్పుడూ గంభీరంగా ఉండే మగరాయుల మనసు చలించుచున్నది.
రాజశేఖరా!ప్రపంచం ప్రార్థించుచున్నది, నీ ఆత్మ శాంతి కొరకు.రాజశేఖరా!
నీవు అజరామమురా!
నీవు అమరుడవురా !
నీకు ఇవే మా జోహారులు!
నేనెరిగిన గొప్ప రాజకీయవేత్తకు,ఇవే మా మనఃపుష్పాంజలులు!

మీ రాజకీయాభిమాని
లొ||.విశ్వనాధ్ రెడ్డి