25 ఫిబ్రవరి 2012

Pure Telugu Girl - పదహారణాల తెలుగు అమ్మాయి

Theme: తన పదహారణాల తెలుగు ప్రేయసిని, ప్రియుడి వర్ణన (A boy describing his lover's(pure telugu girl) beauty in poetic way.)

బొట్టునైన కాకపోతిని,
విశాలమైన ఆకాశం లాంటి నీ నుదుటి పై చందమామ లా వెలిగిపోడానికి.
పుట్టుమచ్చనైనా కాకపోతిని,
పదికాలాలపాటు మేలిమి బంగారపు నీ ఒంటిని అతుక్కుపోడానికి.
ముక్కుపుడకనైనా  కాకపోతిని,
నీ వెచ్చని శ్వాసను ఆశ్వాదించడానికి.
పెదవి రంగునైన కాకపోతిని,
నీ ఆధారాల అందములో తడిసిమువ్వడానికి.
చేవిపోగునైన కాకపోతిని,
అందమైన నీ చెవులను అన్తిపెట్టుకుంటూ ఉండడానికి.
శిరభారణమునైన కాకపోతిని,
నీ హృదయపు లయను వింటూ బతికేయడానికి.
వడ్డానమునైనా కాకపోతిని,
సూక్ష్మమైన నీ నడుముని చుట్టేయడానికి.
గాజులనైనా కాకపోతిని,
సున్నితమైన నీ హస్తములు చేసే పనులకు సవ్వడి చేస్తూ మద్దతివ్వడానికి.
కాలి మువ్వలనైన కాకపోతిని,
నీ పాదపు ప్రతి అడుగునూ అనుసరించడానికి.
పవిటనైనా కాకపోతిని,
పదహారణాల నీ పరువాన్ని దాచుకోడానికి.