Theme: A feelings of a boy when he is missing his loved one.
నువ్వు నాతో నడిచిన క్షణం పరుగెత్తెను ఆనందం నావెంటే,
నువ్వు వెళ్ళిన ఆ క్షణం నుండి పరుగెత్తక తప్పడం లేదు అందని ఆ ఆనందం వెంట...
నువ్వు విడిచి వెళ్ళిన నాకు,
జగమంత ఒంటరితనం,
విశ్వమంతా శూన్యం,
కళ్ళ నిండుగా అంధకారం,
గొంతు నిండుగా మౌనం,
చలనం లేని శరీరం,
భావాలు లేని మనసు వేదిస్తున్నాయి.
మళ్ళీ నువ్వెప్పుడు కనిపిస్తావనే ఆలోచనతో,
గమ్యమేమిటో తెలియని దారిలో సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నా ఒంటరినై....