Theme: Calling the Young India to Vanish the Curroption
ఏ వార్త ఛానల్ చూసినా, ఏముంది మంచి విషయం?
హత్యలు, అత్యాచారాలు,
అపహరణాలు, ఆక్రమణలు,
కుంభకోణాలు, కుళ్ళు కుతంత్రాల రాజకీయాలు.
చిన్న పిల్లలనపహరించిన కిరాతకులను,
స్త్రీలను అత్యాచారం చేసిన కీచకులను,
కుంభకోణాలు చేసిన అవినీతిపరులను,
మగువలపై ఆమ్ల దాడులను చేసిన మానసిక వికలాంగులను,
కాల్చరెందుకు నిట్టనిలువుగా,
భరించడమెందుకు వాళ్ళను సుద్ధ దండుగ,
శునకమైన సిగ్గుపడునే, వాళ్ళది శునక జాతి అయ్యుంటే......
చుట్టూ జరుగుతూ ఉన్నా పట్టించుకునే అవసరమే లేదా.......
చూస్తూ ఉండడమేన మన కర్తవ్యం.....
ఎన్నాళ్ళీ నిర్లక్ష్యం,
స్వేచ్చ అంటే దొరలకు నల్ల డబ్బు దోచిపెట్టడమేనా...
చుట్టూ జరుగుతూ ఉన్నా పట్టించుకునే అవసరమే లేదా.......
చూస్తూ ఉండడమేన మన కర్తవ్యం.....
ఎన్నాళ్ళీ నిర్లక్ష్యం,
ఎన్నాళ్ళీ నిర్వేదం,
తెల్లపాలకుల నుండి తెచుకున్న స్వాతంత్ర్యం ఇదేనా..స్వేచ్చ అంటే దొరలకు నల్ల డబ్బు దోచిపెట్టడమేనా...
మరుగుతున్న యువ రక్తం అవినీతి పరులపై సునామి అలలా ఎగిసిపడేదేన్నడు