25 జులై 2010

I am alive, just because of the government

బతకలేక.....................చావలేక...............
Theme:I kept down my feelings in a funny way to show how corrupted the government is when i saw corruption in the government on news everyday.
కుక్కపిల్ల , అగ్గి పుల్ల, సబ్బుబిళ్ళ కాదేది కవితనర్హం..........
కోడి గుడ్డు , తిరుపతి లడ్డు, తారు రోడ్డు కాదేది అవినీతికనర్హం............
బతకలేక.....................చావలేక...............
విషం తాగాను, చావలేదు, అందులో కూడా కల్తీ వుంది,
వురి వేసుకున్నాను, తాడు తెగింది, నడ్డి విరిగింది,
దూకుదామని బిల్డింగ్ ఎక్కుతుంటే, మెట్లు కూలాయి, కాలు విరిగింది,
చెక్ డ్యాం లోని నీళ్ళలోకి దూకాను, డ్యాం గోడలు బీటలువారి, బయటపడ్డాను,
విద్యుత్తు తీగను పట్టుకున్నాను, కరెంటు కోత,
నడి రోడ్డు ఫై అడ్డంగా నిలబడ్డాను, రోడ్డు బాగోలేక వాహనాలు వేగంగా రాలేదు,
రైలు పట్టాల ఫై పడుకున్నాను, అంతకుముందే రైలు పట్టాలు తప్పింది.
బతకలేక చద్దామనుకున్నాను, ఇలా ప్రబుత్వం దయతో చావలేక బతుకుతున్నాను...

14 జులై 2010

We are all the one, the world is one

We are all the one...........

We are all the one
Black or white, the blood is red,
zero or one, the computer works for everyone,
boy or girl, for every machine, its only "one",
we are living on earth, earth is one for everyone,
though there are so many planets, the sun is one, the moon is one.
We are all the ONE.
the oxygen is one, which we are breathing,
Religion or caste its none, the God is one,
language or expression none, feeling is one,
drink or food are none, hungriness is one.
We all are one, remaining are none.
male or female, the humanity is one,
Views are so many, but the thing is one, the nature is one,
It's for everyone, all has to be done.


Note: I used "None" instead of "Nothing" for rhyming.

13 జులై 2010

Anything is Poetry, Everything is Poetry

ఏదైనా కవిత్వమే, అంత కవిత్వమే.............!

కడుపులో రగిలే ఆవేశాన్ని అనచుకుంటే అదే కవిత్వం,
మనసులో కలిగే వ్యధను దిగమింగితే బయటకోచ్చేదే కవిత్వం,
బయట జరిగే చర్యలకు, లోపలి ప్రతిచర్యే కవిత్వం,
మౌనరాగాలకు మరో రూపమే కవిత్వం,
మనషుల మద్య బాసలకు, లిఖిత రూపమే కవిత్వం,
మనసులోని భావాలకు, మాటల రూపమే కవిత్వం,
పేదవాడి బాధనే కవిత్వం,
పరులకు సేవ చేస్తే కలిగే తృప్తే కవిత్వం,
అనంతమైన భావాలను, అలవోకగా పలికేదే కవిత్వం,

03 జులై 2010

Happy Birthday To My Dear Friend

స్నేహితురాలికి శుభాకాంక్షలు...........

స్నేహితురాలికి శుభాకాంక్షలు,
మిణుకు మిణుకు మనే తారల లాంటి కళ్ళతో,
తామరాకు మీది నీతిబిందువంటి స్వచమైన మనసున్న,
నా మిత్రురాలికి, జన్మదిన శుభాకాంక్షలు.
పసిపిల్లలాగ  స్వచ్చమైన చిరునవ్వుతో,
దూదిపింజలాంటి తేలికైన మనసుతో,
హంసలా ఉన్నతంగా పలువురికి మార్గదర్శకంగా,
పదికాలపాటు పచ్చగా పదిమందికి సహాయపడుతూ,
ఆయురారోగ్య, సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకుంటూ,
ఇలాంటి జన్మదినములు మరెన్నోజరుపుకోవాలని ఆశిస్తూ.............
నీ మిత్రుడు, శ్రేయోభిలాషి,
విశ్వనాధ్