16 జనవరి 2015

ప్రశ్నిస్తే పోయేదేమీ లేదు వస్తే సమాధానం తప్ప - Question is our weapon

ప్రశ్నిస్తే పోయేదేమీ లేదు వస్తే సమాధానం తప్ప - Question is our weapon
ప్రశ్నిస్తే పోయేదేమీ లేదు వస్తే సమాధానం తప్ప.

ప్రశ్నించు ప్రశ్నించు
అబద్దం అలసిపోయేవరకు,
నిజం తెలిసే వరకు.

ప్రశ్నించు ప్రశ్నించు
నాయకులు మారేవరకు,
ప్రజలు పోరాడేవరకు.

ప్రశ్నించు ప్రశ్నించు
అవినీతి కాలిపోయేవరకు,
నీతిగా పనులు జరిగేవరకు.

ప్రశ్నించు ప్రశ్నించు
భయం పారిపోయేవరకు,
ధైర్యం బలపడేవరకు.

ప్రశ్నించు ప్రశ్నించు
ప్రపంచం మారేవరకు,
ప్రజలకు  జరిగేవరకు.

ప్రశ్నించు ప్రశ్నించు
గొంతు పెకల్చి, చేయి ఎత్తి,
నడుము కట్టి, పిడికిలి బిగించి.

ప్రశ్నించు ప్రశ్నించు
ప్రశ్ననే నీ ఆయుధమై,
నిజమే నీ లక్ష్యమై,

ప్రశ్నించు ప్రశ్నించు
ప్రతి కన్నీటి బొట్టుకి న్యాయం జరిగేవరకు. 
ధర్మం నడిచేవరకు
మంచి గెలిచేవరకు

ప్రశ్నించు ప్రశ్నించు
నీ చివరిమాట వరకు
నీ తుదిశ్వాస వరకు