ప్రేమకవిత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రేమకవిత లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25 నవంబర్ 2012

Love Quotes - ప్రేమ - प्यार

You have been my best friend till now,
will you become my better half from now.

So many girls walked in-front of my eyes,
but You walked directly into my heart.

నానుండి దూరంగా వెళితే, నువ్వు బాగుండాలని మాత్రమె కోరుకోగలను,
కాని నాతోనే ఉంటే, నువ్వు బాగుండేలా చూసుకోగలను.

You have been in my life till now,
Will you be my life from now Dear.

I bowled so many batsmen with deadly Yorkers,
but you clean bowled me with your Sweet Smile

When I was walking straight, you walked towards me,
when I started walking towards you, You are walking away....
I know, You are walking away slowly to come back furiously.


If you are away from me, You may stay Happy alone,
But if you are with me, We will be happy Forever Together.
I love you dear...You are my life...You are my soul..

22 నవంబర్ 2012

Our Relationship is Beautiful

సూర్యుడి వెలుగు అనంతం,
శివుడి మూడోకన్ను  అతీతం,
వినాయకుని తొండం అద్వితీయం,
ఆంజనేయుని తోక అద్భుతం,
నాన్న కోపం అక్షర సత్యం,
అమ్మ ప్రేమ అపరిమితం,
అక్క ఆప్యాయత అపురూపం,
తమ్ముడి అలక అరక్షణం,
మన స్నేహం మన జీవితానికి అందం, ఆనందం.

17 ఏప్రిల్ 2012

Wherever you go - my soul is with you only

Wherever you go - my soul is with you only
You could stop talking to me,
but you cannot stop yourself from inspiring me.
You would have forget me,
but you cannot stop me thinking about you.
You could walk away from me,
but you cannot take my memories away.
You could avoid your shade by walking into the darkness,
but you cannot stop my soul from following you everywhere.
You could wish to avoid me ever,
but I am your well wisher forever.......

25 ఫిబ్రవరి 2012

Pure Telugu Girl - పదహారణాల తెలుగు అమ్మాయి

Theme: తన పదహారణాల తెలుగు ప్రేయసిని, ప్రియుడి వర్ణన (A boy describing his lover's(pure telugu girl) beauty in poetic way.)

బొట్టునైన కాకపోతిని,
విశాలమైన ఆకాశం లాంటి నీ నుదుటి పై చందమామ లా వెలిగిపోడానికి.
పుట్టుమచ్చనైనా కాకపోతిని,
పదికాలాలపాటు మేలిమి బంగారపు నీ ఒంటిని అతుక్కుపోడానికి.
ముక్కుపుడకనైనా  కాకపోతిని,
నీ వెచ్చని శ్వాసను ఆశ్వాదించడానికి.
పెదవి రంగునైన కాకపోతిని,
నీ ఆధారాల అందములో తడిసిమువ్వడానికి.
చేవిపోగునైన కాకపోతిని,
అందమైన నీ చెవులను అన్తిపెట్టుకుంటూ ఉండడానికి.
శిరభారణమునైన కాకపోతిని,
నీ హృదయపు లయను వింటూ బతికేయడానికి.
వడ్డానమునైనా కాకపోతిని,
సూక్ష్మమైన నీ నడుముని చుట్టేయడానికి.
గాజులనైనా కాకపోతిని,
సున్నితమైన నీ హస్తములు చేసే పనులకు సవ్వడి చేస్తూ మద్దతివ్వడానికి.
కాలి మువ్వలనైన కాకపోతిని,
నీ పాదపు ప్రతి అడుగునూ అనుసరించడానికి.
పవిటనైనా కాకపోతిని,
పదహారణాల నీ పరువాన్ని దాచుకోడానికి.




07 జులై 2011

I am searching for the happiness

Theme: A feelings of a boy when he is missing his loved one.
నువ్వు నాతో నడిచిన క్షణం పరుగెత్తెను ఆనందం నావెంటే,
నువ్వు వెళ్ళిన ఆ క్షణం నుండి పరుగెత్తక తప్పడం లేదు అందని ఆ ఆనందం వెంట...

నువ్వు విడిచి వెళ్ళిన నాకు,
జగమంత ఒంటరితనం,
విశ్వమంతా శూన్యం,
కళ్ళ నిండుగా అంధకారం,
గొంతు నిండుగా మౌనం,
చలనం లేని శరీరం,
భావాలు లేని మనసు వేదిస్తున్నాయి.
మళ్ళీ నువ్వెప్పుడు కనిపిస్తావనే ఆలోచనతో,
గమ్యమేమిటో తెలియని దారిలో సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నా ఒంటరినై....

03 జూన్ 2011

That's you, That's our friendship

that's you, that's our friendship
గంటల కొద్దీ chat చేయడం,
మూటల కొద్దీ కబుర్లు చెప్పుకోవడం,
satires వేసుకోవడం, tease చేసుకోవడం,
చిన్ని చిన్ని అబద్దాలు చెప్పడం, దొరికిపోతే cover చేసుకోవడం,
జోకులు చేపుకోవడం, పకపక నవ్వడం,
నేను రాసిన కవితలను మొదటగా నీకు చెప్పడం,
నువ్వే మొదటగా comment చేయడం,
ఒకరికొకరు stories చెప్పి నమ్మించడం,
బకరా తెలిశాక ఆశ్చర్యపోవడం,
ఎప్పుడు కలుసుకోకున్నా, ఎప్పుడూ కల్లముందున్నట్లు touch లో ఉండడం,
అది నువ్వు. అది మన  స్నేహం.
కాని దురదృష్టవశాత్తో లేక కలమహిమనో,
నువ్వు అలా లేవు. మన స్నేహం కూడా అలా లేదిప్పుడు.
ఆ నిన్ను నువ్వు miss అవుతున్నావు,
నీ స్వచమైన స్నేహాన్ని నేను miss అవుతున్నా...

08 మే 2011

I miss you my dear

Theme: A boy expresses his feelings when he misses his girl friend.
I miss you my dear
నాతో నువ్వు లేకున్నా,
నీ వెంటే నేనొస్తున్నా.
ఎందుకంత కోపం నీకు,
ఎందుకీ శాపం నాకు.
శాంతిచవా ఇకనైనా,
జాలి చూపవా నా పైన.
నీతో తిరిగిన నా మనసు,
నాతో లేనేలేదిప్పుడు.
నువ్వు తోడుగా లేకున్నా,
నీ నీడననై వస్తున్నా.
నువ్వు నన్నెంత కాదన్నా,
నే నిన్నే కోరుకుంటున్నా.
నాపై నీకెంత ద్వేషమున్నా,
నేను నీ స్నేహాన్నే కోరుకుంటున్నా......

26 ఏప్రిల్ 2011

For me, Nothing is more valuable than you

Theme: A boy wishing his lover on her birthday.
పుష్పమిచ్చి శుభాకాంక్షలు తెలుపుదామంటే నీకన్నా అందమైన పుష్పమెక్కడుంది,
కవిత్వము రాసి వినిపిద్దామంటే, నీ  మాటలకంటే మదురమైన కవిత్వమెక్కడుంది,
బొమ్మను గీసిద్దమనుకుంటే నీలో ఉన్న కళ అందులో ఎక్కడుంది,
విలువైన బహుమతి ఇద్దామనుకుంటే నీకన్నా విలువైనదేముంది,
కలకాలం పువ్వులా నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ,
అందమైన అమ్మాయికి నా వందలాది శుభకాంక్షలు.
ఇట్లు,
నీ శ్రేయోభిలాషి.

09 ఫిబ్రవరి 2011

I love your sweet voice

Theme: Words of a boy while he praises his soul-mate's voice
అలసి పోయేంత వరకూ క్రికెట్ ఆడినట్లుగా,
చలిలో కూడా చెమటలు పట్టేలాగా వ్యాయామం చేసినట్టుగా,
గొంతు అరిగిపోయెంతవరకు పాటలు పాడినంతగా,
కడుపు నిండేవరకు ఆహరం తిన్నంతగా,
అందరూ మెచ్చుకునేంతగా కవిత్వం రాసినట్టుగా,
అందరూ పోగిడెంతగా నాట్యం చేసినట్టుగా,
తిరుపతి లడ్డు ఉన్నంత కమ్మగా,
అంత ఆనందంగా ఉంది నీ తీయనైన గొంతు వింటుంటే.....
ఇలాగే నీ గొంతును వింటూ కలకాలం గడిపేయాలని కోరుకుంటున్నాను.....

07 ఫిబ్రవరి 2011

I could not be a poet to describe your beauty

Theme: A boy praising his girl's beauty
holding hands forever, no matter i promise, i love you
I hold your hand forever
అంతులేనిది ఆశ, నువ్వే నా శ్వాస
సరిపోదు ఈ బాష నిను వర్ణించడానికి,
కానీ ప్రయత్నం చేశా.....
ఓ మానసా....!
నేను కవి నైన కాకపోతిని, నీ అందాన్ని వర్ణించడానికి,
శిల్పి నైన కాకపోతిని, నీ రూపాన్ని శిల్పంలా చెక్కడానికి,
నీ ఊపిరినైన కాకపోతిని, నీ గుండెల నిండుగా ఉండడానికి,
నీ గుండెనైన కాకపోతిని, నీ కోసం ప్రతి క్షణం కొట్టుకోవడానికి,
బ్రహ్మ నైన కాకపోతిని, నీలాంటి ఇంకొక రూపాన్ని స్ప్రుష్టించడానికి,
కాని జన్మ జన్మలకు ఎలాంటి కష్టమెదురైన నీ చేయిని వదలనని నీ చేతిలోన చెయ్యేసి నే మాటిస్తున్నా..

06 డిసెంబర్ 2010

oh dear i will be your shadow

నీ నీడనయి నేను....
Theme: A boy proposing a girl by saying that how he looks after her.

ఓ ప్రియా...........!
కన్నీళ్లు తుడిచి ఓదార్చే అమ్మలా,
ఎప్పుడూ వెన్నంటి ఉండే నాన్నలా,
వెన్నుతట్టి ప్రోత్సహించే తోబుట్టువులా,
ఆపదలో ఆడుకునే స్నేహితుడిలా,
ఎల్లప్పుడూ నీ మంచిని కోరుకునే శ్రేయోభిలాషిలా,
ప్రేమించడంలో మన్మధుడిలా,
జన్మ జన్మలకు నీతోనే ఉంటా,
నిన్ను మహరాణిలా చూసుకుంటా,
కంటికి రెప్పలా కాపాడుకుంటా.
నా కంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తా,
నీ కోసం నా ప్రాణమైన అర్పిస్తా.

23 నవంబర్ 2010

Nuvvu....!! Nenu kaani vela

నువ్వు....!! నేను కాని వేళ............!
Nuvvu....!! Nenu kaani vela a poem by Viswanath (LVR)
Theme: Feelings of a boy when he came to know that he can't live with his beloved anymore.

నన్నెందుకు ప్రేమించలేదంటూ నువ్వు కళ్ళతో నన్ను అడిగిన క్షణం....
నువ్వే నా ప్రాణమంటూ నీకు సమాధానం చెప్పలేని ఆ క్షణం,
మౌనమే నా సమాధానమంటూ నా గొంతు మూగబోయిన క్షణం,
నా పాదాలు నీతో నడవలేవని తెలిసిన...మరుక్షణం
నా చేతులు నీ కన్నీళ్లను తుడవలేని తక్షణం,
నువ్వు నా సొంతం కాదని తెలిసినప్పుడు నా మనసు చలించింది
నా మనసు నన్ను నిలదీసిన ఆక్షణం నా జీవితం వ్యర్తమనిపించింది
నేనెక్కడున్నా... నా మనసు మాత్రం ఉంటుంది నీతోనే
మరుజన్మంటూ ఉంటే అది నీ స్నేహితుడిగానే
ఎన్ని జన్మలకైనా నేను నీ చేతిలోన చెయ్యేసి జీవితాంతం నీకు తోడుగా ఉంటానని ఆశిస్తూ........
ఎల్లప్పుడూ నీ సంతోషాన్ని కోరుకునే,
నీ శ్రేయోభిలాషి.

22 ఆగస్టు 2010

I will leave the heaven if you are not there, i will make Heaven in the hell if you are with me

నీవు లేకుంటే స్వర్గామైన అది నాకు నరకం, నీవుంటే నరకమైన అది నాకు స్వర్గమే...............
Theme:Feelings of a boy when he met his beloved after few days being away due to some situations.

నీతో మాటలాడని ప్రతి క్షణం నాకొక యుగం,
నేను రెక్కలు తెగిన పక్షిలా,
ఒడ్డున పడిన చేపలా,
నీట మునిగిన పడవలా,
పంజరంలో బంధించబడిన చిలుకలా బతికాను,
నిను కలిసిన మరుక్షణం,
అప్పుడే పుట్టిన లేగదూడలా,
కొత్తగా నడక నేర్చిన చిన్న పిల్లాడిలా,
అప్పుడే బయటకోచిన సీతాకోకచిలుకలా,
ఎగిసి పడుతున్న అలలా,
జల జల పారుతున్న సెలయేరులా,
చాలా రోజుల తర్వాత ఊపిరి తీసుకున్నట్లుగా,
నా మనసు ఆనందంతో పరవశిస్తోంది.

02 ఆగస్టు 2010

Friendship is life, Life is Friendship

స్నేహమేరా జీవితం, జీవితమే స్నేహం...........

ఒకే తల్లికి పుట్టని కవలలే స్నేహితులంటే..........
స్నేహానికి మతం లేదు, కులం లేదు,
డబ్బు అడ్డురాలేదు,
ఆడ, మగ భేదం లేదు,
చిన్న, పెద్ద తేడా లేదు,
స్నేహానికి బాష అవసరం లేదు, భావమే ముఖ్యం,
రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు, రెండు మనసులు కలిస్తేనే స్నేహం,
స్నేహానికి నమ్మకమే పునాది, అనుమానమే సమాధి,
తల్లిదండ్రులు లేని వాడు కాదు అనాధ, స్నేహితులు లేని వాడే అనాధ,
మన తల్లి దండ్రులను మనము ఎంచుకోలేము,
కాని మంచి స్నేహితులను వెతుకోవచ్చు,
స్నేహమందించును ఆనందం, అది నిలిచెను కలకాలం,
స్నేహమే జీవితం, జీవితమే స్నేహం.

13 జులై 2010

Anything is Poetry, Everything is Poetry

ఏదైనా కవిత్వమే, అంత కవిత్వమే.............!

కడుపులో రగిలే ఆవేశాన్ని అనచుకుంటే అదే కవిత్వం,
మనసులో కలిగే వ్యధను దిగమింగితే బయటకోచ్చేదే కవిత్వం,
బయట జరిగే చర్యలకు, లోపలి ప్రతిచర్యే కవిత్వం,
మౌనరాగాలకు మరో రూపమే కవిత్వం,
మనషుల మద్య బాసలకు, లిఖిత రూపమే కవిత్వం,
మనసులోని భావాలకు, మాటల రూపమే కవిత్వం,
పేదవాడి బాధనే కవిత్వం,
పరులకు సేవ చేస్తే కలిగే తృప్తే కవిత్వం,
అనంతమైన భావాలను, అలవోకగా పలికేదే కవిత్వం,

03 జులై 2010

Happy Birthday To My Dear Friend

స్నేహితురాలికి శుభాకాంక్షలు...........

స్నేహితురాలికి శుభాకాంక్షలు,
మిణుకు మిణుకు మనే తారల లాంటి కళ్ళతో,
తామరాకు మీది నీతిబిందువంటి స్వచమైన మనసున్న,
నా మిత్రురాలికి, జన్మదిన శుభాకాంక్షలు.
పసిపిల్లలాగ  స్వచ్చమైన చిరునవ్వుతో,
దూదిపింజలాంటి తేలికైన మనసుతో,
హంసలా ఉన్నతంగా పలువురికి మార్గదర్శకంగా,
పదికాలపాటు పచ్చగా పదిమందికి సహాయపడుతూ,
ఆయురారోగ్య, సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకుంటూ,
ఇలాంటి జన్మదినములు మరెన్నోజరుపుకోవాలని ఆశిస్తూ.............
నీ మిత్రుడు, శ్రేయోభిలాషి,
విశ్వనాధ్

20 మే 2010

what to say....how to say.....

ఏమని చెప్పను..............ఎలా చెప్పను.............

ఏమని చెప్పను..............ఎలా చెప్పను.............
కడవరకు నీతోనే ఉంటానని కళ్ళతో చెప్పనా......
కాళిదాసు లాగ కవిత్వం రాయనా....
మగధీరుడి లాగ మరిపిస్తూ చెప్పనా.........
పదికాలాలపాటు నీతోడుగా ఉంటానని నీ స్వచమైన పాదాల మీద ఒట్టేసి చెప్పనా.....
ఏమని చెప్పను..............ఎలా చెప్పను.............
కటిక చీకటిలో కూడా కొవ్వొత్తిలా వెలుగు చూపిస్తానని చెప్పనా......
జడివానలో గోడుగునవుతానని చెప్పనా..........
మండుటెండలో మంచినీటిని అవుతానని చెప్పనా.....
గగుర్పొడిచే చలిలో నీఒంట్లో వేడినవుతానని చెప్పనా.......
నిను మౌనమేలే సమయంలో నిను మైమరిపించే మాటనవుతానని చెప్పనా.......
నీవు దుఖసంద్రంలో ఉంటె నీ కన్నీరు తుడిచే చేయినవుతనని చెప్పనా.........
ఏమని చెప్పను..............ఎలా చెప్పను.............
నీవు నాట్యం చేసే వేల నీ కాలి మువ్వలనవుతానని చెప్పనా..........
నీవు ఒంటరనుకునేవేళ నీతో నడిచే పాదమవుతనని చెప్పనా............
నీవు బాధలో కార్చే కన్నీటి బొట్టునవుతానని చెప్పనా...........
ఎప్పుడూ నిను అనుసరించే నీ నీడనవుతనని చెప్పనా.........
ఎప్పుడూ నువ్వ్వు పీల్చే శ్వాసనవుతానని చెప్పనా.......

14 మే 2010

why i shouldn't love you..................

నేను నిన్నెందుకు ప్రేమించొద్దు.......?

నేను నిన్నెందుకు ప్రేమించొద్దు.......?
నేను చెప్పే కబుర్లు వింటున్నందుకా ....
నువ్వు నా శ్రేయోభిలాషి అయినందుకా...
నువ్వు అందంగా ఉన్నందుకా.....
ఈ మనసు స్వచ్చమినది అయినందుకా.........
నేను నిన్నెందుకు ప్రేమించొద్దు.......?
నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకా.........
ఎప్పుడూ నా నీడలా నాకు తోడుగా ఉన్నందుకా....
ఎప్పుడూ చిరునవ్వు చెరగని నీ మోమును నేను చూస్తూ బతికేస్తున్నందుకా....
నేను నిన్నెందుకు ప్రేమించొద్దు.......?
నువ్వే నా ప్రపంచం అయినందుకా......
నా మనసు నీదయినందుకా............
నీ నీడ నేనయినందుకా.......
నువ్వు నాకు అత్మీయురాలువైనందుకా.......?

27 ఏప్రిల్ 2010

Nuvvu leka ..... Nenu Lenu

నువ్వు లేక నేను లేను .......................

సూర్యుడు లేని ఉదయం,
ఇసుకలేని ఎడారి,
నీరు లేని సముద్రం ,
నువ్వ్వు లేని నేను,
ఇవన్ని అసాధ్యాలు.
నిన్ను పలకరించని ఉదయం,
నీతో మాట్లాడని క్షణం,
నీతో నడవలేని నా పాదాలు ,
నిను చూడని నా కనులు,
సముద్రంలో కురిసే వర్షం లాగ,
మోడైన వృక్షం లాగ,
పని చేయని యంత్రం లాగ,
నువ్వు లేని నేను వ్యర్థం ప్రియా....!

14 మార్చి 2010

ooh priyathama...! aah okka kshanam

ఓ ప్రియతమా...! ఆ ఒక్క క్షణం..................

ఓ ప్రియా !
దొండపండు లాంటి నీ అధరాలతో ,
ముత్యాల్లాంటి పళ్ళతో నువ్వు గలగల నవ్వుతుంటే,
నీ కళ్ళలో ఆనందం నన్ను మైమరిపిస్తుంటే,
నీ చెవి పోగుల శబ్దం నను తాకుతుంటే,
నీ చేతి గాజుల సంగీతం నా మనసును హోరెత్తిస్తుంటే.....
నీ నల్లని కురులు అల్లరి నను కవ్విస్తుంటే...
నీ కాలి మువ్వల సవ్వడి నా మనసులో అలజడి పుట్టిస్తుంటే...
చాలదా ఆ ఒక్క క్షణం నా ఈ జీవితానికి....
చాలదా ఆ ఒక్క క్షణం ఈ ప్రపంచాన్ని మరిచిపోవడానికి...................