20 మే 2010

what to say....how to say.....

ఏమని చెప్పను..............ఎలా చెప్పను.............

ఏమని చెప్పను..............ఎలా చెప్పను.............
కడవరకు నీతోనే ఉంటానని కళ్ళతో చెప్పనా......
కాళిదాసు లాగ కవిత్వం రాయనా....
మగధీరుడి లాగ మరిపిస్తూ చెప్పనా.........
పదికాలాలపాటు నీతోడుగా ఉంటానని నీ స్వచమైన పాదాల మీద ఒట్టేసి చెప్పనా.....
ఏమని చెప్పను..............ఎలా చెప్పను.............
కటిక చీకటిలో కూడా కొవ్వొత్తిలా వెలుగు చూపిస్తానని చెప్పనా......
జడివానలో గోడుగునవుతానని చెప్పనా..........
మండుటెండలో మంచినీటిని అవుతానని చెప్పనా.....
గగుర్పొడిచే చలిలో నీఒంట్లో వేడినవుతానని చెప్పనా.......
నిను మౌనమేలే సమయంలో నిను మైమరిపించే మాటనవుతానని చెప్పనా.......
నీవు దుఖసంద్రంలో ఉంటె నీ కన్నీరు తుడిచే చేయినవుతనని చెప్పనా.........
ఏమని చెప్పను..............ఎలా చెప్పను.............
నీవు నాట్యం చేసే వేల నీ కాలి మువ్వలనవుతానని చెప్పనా..........
నీవు ఒంటరనుకునేవేళ నీతో నడిచే పాదమవుతనని చెప్పనా............
నీవు బాధలో కార్చే కన్నీటి బొట్టునవుతానని చెప్పనా...........
ఎప్పుడూ నిను అనుసరించే నీ నీడనవుతనని చెప్పనా.........
ఎప్పుడూ నువ్వ్వు పీల్చే శ్వాసనవుతానని చెప్పనా.......

5 వ్యాఖ్యలు: