స్నేహమేరా జీవితం, జీవితమే స్నేహం...........
ఒకే తల్లికి పుట్టని కవలలే స్నేహితులంటే..........
స్నేహానికి మతం లేదు, కులం లేదు,
డబ్బు అడ్డురాలేదు,
ఆడ, మగ భేదం లేదు,
చిన్న, పెద్ద తేడా లేదు,
స్నేహానికి బాష అవసరం లేదు, భావమే ముఖ్యం,
రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు, రెండు మనసులు కలిస్తేనే స్నేహం,
స్నేహానికి నమ్మకమే పునాది, అనుమానమే సమాధి,
తల్లిదండ్రులు లేని వాడు కాదు అనాధ, స్నేహితులు లేని వాడే అనాధ,
మన తల్లి దండ్రులను మనము ఎంచుకోలేము,
కాని మంచి స్నేహితులను వెతుకోవచ్చు,
స్నేహమందించును ఆనందం, అది నిలిచెను కలకాలం,
స్నేహమే జీవితం, జీవితమే స్నేహం.