Theme: Mental state of a person when he/she feels everything is going wrong and what he/she should do overcome the situation.
వెళ్తున్న పడవే మునిగిపోతే,
ఎగురుతున్న విమానమే కూలిపోతే,
సాగుతున్న పయనం ఆగిపోతే,
పరిస్థితులను నిందించక,
పరులను దూషించక ,
కసిగా ముందు సాగేవాడే మనిషి,
గుణపాఠం నేర్పేదే జీవితం.
సముద్రములో కెరటాలు సాధారణం,
జీవితంలో ఒడిదుడుకులు సర్వసాధారణం.
ఆత్మవిశ్వాసం కోల్పోకు,
భవిష్యత్తు నీదేనని మర్చిపోకు.
ఎగిసిపడే అలవై,
నేలను తాకిన బంతివై,
రగులుతున్న నిప్పువై,
రెట్టింపైన ఆశతో ముందుకు సాగిపో...