ఏదైనా కవిత్వమే, అంత కవిత్వమే.............!
కడుపులో రగిలే ఆవేశాన్ని అనచుకుంటే అదే కవిత్వం,
మనసులో కలిగే వ్యధను దిగమింగితే బయటకోచ్చేదే కవిత్వం,
బయట జరిగే చర్యలకు, లోపలి ప్రతిచర్యే కవిత్వం,
మౌనరాగాలకు మరో రూపమే కవిత్వం,
మనషుల మద్య బాసలకు, లిఖిత రూపమే కవిత్వం,
మనసులోని భావాలకు, మాటల రూపమే కవిత్వం,
పేదవాడి బాధనే కవిత్వం,
పరులకు సేవ చేస్తే కలిగే తృప్తే కవిత్వం,
అనంతమైన భావాలను, అలవోకగా పలికేదే కవిత్వం,