07 జూన్ 2011

lighten up the fire in you for your country

Theme: An energetic lines dedicated to young India to come against the corruption in India
lighten up the fire in you for the country India, LVR Poetry
కదలిరా కదలిరా!
శక్తియుక్తులున్న యువకులారా,
భావి భారత పౌరులారా,
అలుపెరుగని పోరాటానికి, నిరంతర యుద్దానికి.
ఉదయించరా ఉదయించరా సూర్యునివలె!!
అందరికి వెలుగునివ్వడానికి.
తీసుకురా తీసుకురా బయటికి!!
నీలో నివురు గప్పిన నిప్పును,
కాల్చేయడానికి దేశపు అవినీతిని,
దేశ తలరాతను మార్చడానికి,
పరుగెత్తిరా పరుగెత్తిరా!!
కుంటుపడుతున్న అభివృద్దిని పరుగుపెట్టించడానికి.
కొందరిదగ్గర పేరుకుపోతున్న నల్లధనాన్ని అందరికీ పంచేందుకు
దీపమైరా దీపమైరా!!
అవకాశవాదులకు ఆవిరవుతున్న పేదల బతుకుల్లో ఆశాదీపం వెలిగించడానికి.
ఎదురురా ఎదురురా!!
నడుంకట్టి, పిడికిలి బిగించి దృడనిశ్చయంతో,
దుర్మార్గుల మెడలు వంచి, అవినీతి కోరలు పీకేందుకు.