16 మే 2010

the day has came....which i didn't want

నేను అనుకోలేదేనాడు ఇలాంటి రోజొకటి వస్తుందని..........
నా స్నేహితులను నానుండి దూరం చేస్తుందని ....
నా గుండె నిండా బాధని నింపుతుందని.........
ఆ రోజు రానే వచ్చింది, విడిపోయే రోజు.
అందరిని దగ్గరికి తెచ్చింది విడిపోవడానికి.
ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ కలిసి చదివాం, ఆడాం, పాడాం, అల్లరి పనులు చేసాం, తిరిగాం, పోట్లడాము,  కలిసిపోయాం.
మిమ్మల్ని కలవని ముందు రోజు వరకూ...
ఈ నాలుగు సంవత్సరాలు నాల్గు యుగాలుగా మిగిలిపోతాయి అనుకున్న.
కాని నాలుగు క్షణాలుగా కరిగిపోతాయని అనుకోలేదు.
ఇలా నా ఎదను మీ జ్ఞాపకాలతో నింపుతాయనుకోలేదు.


ఇదే నా అపూర్వమైన స్నేహితులకు నా మనః పుష్పాభినందనములు,
ఇట్లు మీ స్నేహితుడు మరియు శ్రేయోభిలాషి,
విశ్వనాధ్ రెడ్డి.