22 ఆగస్టు 2010

I will leave the heaven if you are not there, i will make Heaven in the hell if you are with me

నీవు లేకుంటే స్వర్గామైన అది నాకు నరకం, నీవుంటే నరకమైన అది నాకు స్వర్గమే...............
Theme:Feelings of a boy when he met his beloved after few days being away due to some situations.

నీతో మాటలాడని ప్రతి క్షణం నాకొక యుగం,
నేను రెక్కలు తెగిన పక్షిలా,
ఒడ్డున పడిన చేపలా,
నీట మునిగిన పడవలా,
పంజరంలో బంధించబడిన చిలుకలా బతికాను,
నిను కలిసిన మరుక్షణం,
అప్పుడే పుట్టిన లేగదూడలా,
కొత్తగా నడక నేర్చిన చిన్న పిల్లాడిలా,
అప్పుడే బయటకోచిన సీతాకోకచిలుకలా,
ఎగిసి పడుతున్న అలలా,
జల జల పారుతున్న సెలయేరులా,
చాలా రోజుల తర్వాత ఊపిరి తీసుకున్నట్లుగా,
నా మనసు ఆనందంతో పరవశిస్తోంది.

3 వ్యాఖ్యలు: