07 ఫిబ్రవరి 2011

I could not be a poet to describe your beauty

Theme: A boy praising his girl's beauty
holding hands forever, no matter i promise, i love you
I hold your hand forever
అంతులేనిది ఆశ, నువ్వే నా శ్వాస
సరిపోదు ఈ బాష నిను వర్ణించడానికి,
కానీ ప్రయత్నం చేశా.....
ఓ మానసా....!
నేను కవి నైన కాకపోతిని, నీ అందాన్ని వర్ణించడానికి,
శిల్పి నైన కాకపోతిని, నీ రూపాన్ని శిల్పంలా చెక్కడానికి,
నీ ఊపిరినైన కాకపోతిని, నీ గుండెల నిండుగా ఉండడానికి,
నీ గుండెనైన కాకపోతిని, నీ కోసం ప్రతి క్షణం కొట్టుకోవడానికి,
బ్రహ్మ నైన కాకపోతిని, నీలాంటి ఇంకొక రూపాన్ని స్ప్రుష్టించడానికి,
కాని జన్మ జన్మలకు ఎలాంటి కష్టమెదురైన నీ చేయిని వదలనని నీ చేతిలోన చెయ్యేసి నే మాటిస్తున్నా..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి