07 జూన్ 2011

lighten up the fire in you for your country

Theme: An energetic lines dedicated to young India to come against the corruption in India
lighten up the fire in you for the country India, LVR Poetry
కదలిరా కదలిరా!
శక్తియుక్తులున్న యువకులారా,
భావి భారత పౌరులారా,
అలుపెరుగని పోరాటానికి, నిరంతర యుద్దానికి.
ఉదయించరా ఉదయించరా సూర్యునివలె!!
అందరికి వెలుగునివ్వడానికి.
తీసుకురా తీసుకురా బయటికి!!
నీలో నివురు గప్పిన నిప్పును,
కాల్చేయడానికి దేశపు అవినీతిని,
దేశ తలరాతను మార్చడానికి,
పరుగెత్తిరా పరుగెత్తిరా!!
కుంటుపడుతున్న అభివృద్దిని పరుగుపెట్టించడానికి.
కొందరిదగ్గర పేరుకుపోతున్న నల్లధనాన్ని అందరికీ పంచేందుకు
దీపమైరా దీపమైరా!!
అవకాశవాదులకు ఆవిరవుతున్న పేదల బతుకుల్లో ఆశాదీపం వెలిగించడానికి.
ఎదురురా ఎదురురా!!
నడుంకట్టి, పిడికిలి బిగించి దృడనిశ్చయంతో,
దుర్మార్గుల మెడలు వంచి, అవినీతి కోరలు పీకేందుకు.
పౌరుడవైరా పౌరుడవైరా!!
అసలు సిసలు దేశభక్తిని రుచి చూపించేందుకు,
మన దేశపు విలువలు కాపాడేందుకు.
ఎగసిరా ఎగసిరా ఎగిరిపడే అలవై!!
దానవుల మనసులో దుర్మార్గాన్ని తుడిచిపెట్టేందుకు.
నడచిరా నడచిరా ఒక్కడివే!!
పదిమందికి దారి చూపడానికి.
మేల్కొనిరా మేల్కొనిరా!!
నిద్రపోతున్న న్యాయధర్మాలను మేల్కొలిపెందుకు.
నీతిలేని నాయకులను తరమడానికి.
తెగించిరా తెగించిరా!!
కడవరకూ పోరాడడానికి,
చర్తను తిరగారాయడానికి,
కోరుకున్న భవితకోసం,
స్వచ్చమైన జీవితం కోసం,
అసలుసిసలు స్వాతంత్ర్యం కోసం.

kadali ra kadali ra
shakthi ukthulunna yuvakulaara,
bhaavi bhaaratha powrulaara.
aluperugani poraataaniki, niranthara uddaniki.
udayincharaa udayinchara sooryunivale,
andariki velugunivvadaniki.
teesukuraa teesukuraa bayatiki!!
neelo nivuru gappina nippunu,
kaalcheyadaaniki deshapu avineethini
desha talaraathanu maarchadaaniki,
parugethiraa parugethiraa!!
kuntupadutunna abivruddini parugupettinchadaaniki.
kondaridaggara perukupothunna nalladhanaanni andarikee panchenduku
deepamairaa deepamairaa!!
avavineethiki aaviravutunna pedala bathukullo aashadeepam veliginchadaaniki.
edururaa edururaa!!
nadumkatti, pidikili biginchi drudanischayantho,
durmaargula medalu vanchi, avineethi koralu peekenduku
pourudavairaa pourudavairaa!!
asalu sisalu deshbakthini ruchi choopinchenduku,
mana deshapu viluvalu kaapadenduku.
egasiraa egasiraa egiripade alavai!!
danavula manasulo durmaargaanni tudichipettenduku.
nadachiraa nadachiraa okkadive,
padimandiki daari choopadaaniki.
melkoniraa melkoniraa!!
nidrapothunna nyaayadharmaalanu melkolipenduku.
neethileni naayakulanu taramadaaniki.
teginchiraa teginchira!!
kadavarakoo poraadadaaniki,
korukunna bhavithakosam,
swachamaina jeevitham kosam,
asalusisalu swaathanthryam kosam.

2 వ్యాఖ్యలు: