26 ఆగస్టు 2011

దేవుడే ఉంటే - If God exists...

దేవుడే ఉంటే,
అనాధలను పుట్టించేవాడు కాదు,
అందరు ఉంది అనాధలుగా బతికే ముసలివాళ్ళు ఉండేవాళ్ళు కాదు,
అవినీతికి అర్థం ఉండేది కాదు,
అన్ని ఉన్న సోమరిపోతులు ఉండేవాళ్ళు కాదు,
ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉండేవికావు,
అరాచకాలు పురుడు పోసుకునేవి కావు,
ఆడపిల్లలకు వేధింపులు ఉండేవి కావు

25 ఆగస్టు 2011

నా ఈ దేశంలో - In my own country

మతము గొప్పని,కులము గొప్పని,
మానవత్వం మంటగలిపే మూర్ఖులకు తావిక లేదు నా ఈ దేశంలో,
నీతి లేని,నిజాయితీ లేని,
నాయకులు ఉండరిక నా ఈ రాజ్యంలో,
శక్తి ఉన్న,యుక్తి ఉన్న సోమరిపోతు
యువకులు ఉండరిక నా ఈ ప్రపంచంలో,
ఆస్తి కోసం, అవసరం కోసం, అమాయకులను బలితీసుకునే
అరాచకులు ఉండరిక నా ఈ రాష్ట్రంలో.
ఆకలి దప్పికలు, ఆత్మహత్యలు,కరువు కాటకాలు,
కనుమరుగవ్వును నా ఈ విశ్వంలో.

17 ఆగస్టు 2011

solution lies within the problem

శిల్పి ఉలితో చూడు రాతిలో కూడా శిల్పం కనిపిస్తుంది,
చిత్రకారుని కుంచెతో చూడు చిన్న అట్టముక్కలో కూడా బొమ్మ కనిపిస్తుంది,
కవి కలంతో చూడు తెల్లని కాగితంపై కూడా కవిత్వం కనిపిస్తుంది,
సంగీత విద్వాంసుని చెవులతో విను నిశ్శబ్దం లో కూడా సంగీతం వినిపిస్తుంది,
మిణుగురుపురుగు కళ్ళతో చూడు కటిక చీకటిలో కూడా వెలుగు కిరణం దరిచూపిస్తుంది,
ఆశావాదంతో వెతుకు ఎదారిలోనే ఒయాసిస్సు అగుపిస్తుంది,
నిశ్చలమైన మనస్సుతో ఆలోచించు సమస్యలోనే పరిష్కారం లభిస్తుంది,
స్వచ్చమైన మనస్సుతో అర్థం చేసుకో చెడినవాడిలో కూడా మంచి స్పురిస్తుంది

14 ఆగస్టు 2011

Real motto of Independence

¨motto
జాతీయ పతాకం ఎగురవేసి, గీతాన్ని ఆలపించి,
మిఠాయిలు పంచి, ఆరోజుటితో మరిచిపోక,
పతాకం ఉద్దేశ్యం తెలుసుకుని, జాతీయ గీతం లోని విలువలకోసం కృషి చేయడం,
చరిత్రను చెప్పుకుంటూ బతికేయక,
చరిత్రను నిజం చేస్తూ, ప్రపంచానికి దిశా నిర్దేశం చేయడమే మన ధ్యేయం.
మన పూర్వీకుల జ్ఞానాన్ని ఉపయోగిస్తూ, 
మన సంస్కృతి , సాంప్రదాయాలను ప్రపంచానికి చాటడమే మన కర్తవ్యం.
అణు ఆయుధాలకోసం పోటిపడుతున్న ప్రపంచ దేశాలను,
అనుబంధాలతో కట్టిపడేసి శాంతిని నెలకొల్పడమే మన లక్ష్యం.

నిదురపోతున్న భారతీయుడా!! మేలుకో,
జరుగుతున్న అన్యాయాన్ని ఆపడానికి,
ముసురుతున్న చీకటిని తరమడానికి.

వ్యక్తిత్వ వికాసమే దేశాభివృద్దికి పునాది,
పరులహితమే ప్రపంచశాంతికి నాంది.

10 ఆగస్టు 2011

protest is not meant for violence

పేదోళ్ళ పోట్టకొడుతూ,
సామాన్యుల నడ్డి విరచడం కాదు ఉద్యమం అంటే.
విద్యార్థులను రోడ్డు పైకి తెస్తూ, ఆపైన కటకటాల వెనక్కి నెట్టేస్తూ,
వారి ఉజ్వల భవిష్యత్తుని గాఢ అంధకారం లోకి తోయడం కాదు ఉద్యమం అంటే.
ఇల్లు గడవక, పని దొరకక,
కడుపు నిండక రోదించే నిరుపేదల ఆకలి కేకలు కాదు ఉద్యమం అంటే.
నడిచే అభివృద్దిని వెనక్కి తోస్తూ,
భవిష్యత్తును భూతకాలం లోకి తీసుకెళ్లడం కాదు ఉద్యమం అంటే.
పచ్చగా ఉండాల్సిన మట్టిని,
నెత్తుటితో ఎర్రగా మార్చడం కాదు ఉద్యమమంటే.
వెనకున్న చరిత్ర కాదు, ముందు ఉన్న భవిత ముఖ్యం,
నాయకుల ఆశలు కాదు, ప్రజలకున్న ఆశయాలే ముఖ్యం.
సమరం కాదు సామరస్యతే ముఖ్యం,
హింస కాదు ముఖ్యం శాంతి స్థాపనే లక్ష్యం,
ప్రాంతాలు కాదు సర్వజనుల హితమే ముఖ్యం.

07 ఆగస్టు 2011

Friendship is relationship of lifetime

Friendship is not a single day relationship,
Its a relationship of lifetime,
with tons of feelings,
thousands of chats,
hundreds of meetings,
between two heart-full persons,
of one soul.

Friendship is not a single day celebration,
Its everyday celebration.

---------------dedicated to all my friends.......:)
and thank you all for being my friends.....and I hope we will be friends forever like this....

I have been enjoying every bit of it.

05 ఆగస్టు 2011

Todays hard work pays you tomorrow

hard work pays off tomorrow lvr poetry viswanath telugu
Theme: Do it right now for tomorrow

నేటి రాత్రే రేపు ఉదయాన్ని తెస్తుంది,
ఇప్పటి మౌనమే రేపు సమాధానమిస్తుంది,
ఇప్పటి ఆశనే రేపు అవకాశాన్ని స్ప్రుష్టిస్తుంది,
నేటి బాధే రేపు కసిని రగిలిస్తుంది,
నేటి నీ ప్రయత్నమే రేపు నీకు ఫలితాన్నిస్తుంది,
నేటి  నీ శ్వాసే రేపటి వరకు నిన్ను నిలుపుతుంది,
నేటి కష్టమే రేపు నీకు సుఖాన్నిస్తుంది.

04 ఆగస్టు 2011

Never Give up, Fight till the end

Never lose your hope, Be positive always
Theme: Never lose your hope, be positive always. Your 'Will power' takes you to bright future from dark past.

మౌనమే మాటలను స్ప్రుష్టిస్తుంది,
నిశ్శబ్దంలో నుండి విప్లవం పుడుతుంది,
అలసట నుండే శక్తి జనిస్తుంది,
ఓటమి నుండే విజయం పుట్టుకొస్తుంది,
దుఖాన్ని సంతోషం అనుసరిస్తుంది,
దురదృష్టం లోనే అదృష్టం ఉంది,
విషాదాన్ని ఆనందం మరపిస్తుంది,
చీకటిని వెలుతురూ తరుముతుంది,
బాధలోనుండే కసి రగులుతుంది,
కష్టపడితేనే సుఖం తెలుస్తుంది.