26 ఆగస్టు 2011

దేవుడే ఉంటే - If God exists...

దేవుడే ఉంటే,
అనాధలను పుట్టించేవాడు కాదు,
అందరు ఉంది అనాధలుగా బతికే ముసలివాళ్ళు ఉండేవాళ్ళు కాదు,
అవినీతికి అర్థం ఉండేది కాదు,
అన్ని ఉన్న సోమరిపోతులు ఉండేవాళ్ళు కాదు,
ఆకలి చావులు, ఆత్మహత్యలు ఉండేవికావు,
అరాచకాలు పురుడు పోసుకునేవి కావు,
ఆడపిల్లలకు వేధింపులు ఉండేవి కావు

25 ఆగస్టు 2011

నా ఈ దేశంలో - In my own country

మతము గొప్పని,కులము గొప్పని,
మానవత్వం మంటగలిపే మూర్ఖులకు తావిక లేదు నా ఈ దేశంలో,
నీతి లేని,నిజాయితీ లేని,
నాయకులు ఉండరిక నా ఈ రాజ్యంలో,
శక్తి ఉన్న,యుక్తి ఉన్న సోమరిపోతు
యువకులు ఉండరిక నా ఈ ప్రపంచంలో,
ఆస్తి కోసం, అవసరం కోసం, అమాయకులను బలితీసుకునే
అరాచకులు ఉండరిక నా ఈ రాష్ట్రంలో.
ఆకలి దప్పికలు, ఆత్మహత్యలు,కరువు కాటకాలు,
కనుమరుగవ్వును నా ఈ విశ్వంలో.

17 ఆగస్టు 2011

solution lies within the problem

శిల్పి ఉలితో చూడు రాతిలో కూడా శిల్పం కనిపిస్తుంది,
చిత్రకారుని కుంచెతో చూడు చిన్న అట్టముక్కలో కూడా బొమ్మ కనిపిస్తుంది,
కవి కలంతో చూడు తెల్లని కాగితంపై కూడా కవిత్వం కనిపిస్తుంది,
సంగీత విద్వాంసుని చెవులతో విను నిశ్శబ్దం లో కూడా సంగీతం వినిపిస్తుంది,
మిణుగురుపురుగు కళ్ళతో చూడు కటిక చీకటిలో కూడా వెలుగు కిరణం దరిచూపిస్తుంది,
ఆశావాదంతో వెతుకు ఎదారిలోనే ఒయాసిస్సు అగుపిస్తుంది,
నిశ్చలమైన మనస్సుతో ఆలోచించు సమస్యలోనే పరిష్కారం లభిస్తుంది,
స్వచ్చమైన మనస్సుతో అర్థం చేసుకో చెడినవాడిలో కూడా మంచి స్పురిస్తుంది

14 ఆగస్టు 2011

Real motto of Independence

¨motto
జాతీయ పతాకం ఎగురవేసి, గీతాన్ని ఆలపించి,
మిఠాయిలు పంచి, ఆరోజుటితో మరిచిపోక,
పతాకం ఉద్దేశ్యం తెలుసుకుని, జాతీయ గీతం లోని విలువలకోసం కృషి చేయడం,
చరిత్రను చెప్పుకుంటూ బతికేయక,
చరిత్రను నిజం చేస్తూ, ప్రపంచానికి దిశా నిర్దేశం చేయడమే మన ధ్యేయం.
మన పూర్వీకుల జ్ఞానాన్ని ఉపయోగిస్తూ, 
మన సంస్కృతి , సాంప్రదాయాలను ప్రపంచానికి చాటడమే మన కర్తవ్యం.
అణు ఆయుధాలకోసం పోటిపడుతున్న ప్రపంచ దేశాలను,
అనుబంధాలతో కట్టిపడేసి శాంతిని నెలకొల్పడమే మన లక్ష్యం.

నిదురపోతున్న భారతీయుడా!! మేలుకో,
జరుగుతున్న అన్యాయాన్ని ఆపడానికి,
ముసురుతున్న చీకటిని తరమడానికి.

వ్యక్తిత్వ వికాసమే దేశాభివృద్దికి పునాది,
పరులహితమే ప్రపంచశాంతికి నాంది.