27 ఫిబ్రవరి 2012

ఆరోగ్యమే మహాభాగ్యం - Health is Wealth

Hitech-city వెళితే అక్కడ ఉద్యోగులను,companyలను చూసి,
ఒక software job కావాలనిపిస్తుంది.
RTC 'X' Roads వెళితే అక్కడ Govt. ఉద్యోగార్తులను(అభ్యర్థులను) చూసి,
ఒక Govt. ఉద్యోగం కావాలనిపిస్తుంది.
Banjara Hills వెళితే అక్కడ దర్జాలు చూసి,
కనీసం ఒక పెద్ద Building, ఖరీదైన car కావాలనిపిస్తుంది.
Ameerpet వెళితే అక్కడ అందమైన అమ్మాయిలను చూసి,
ఒక Girl Friend కావాలనిపిస్తుంది.
కాని ఏదైనా hospital కి వెళ్ళితే అక్కడ patients ను చూసి,
అవన్నీ ఏమి వద్దు రా దేవుడా..... ఆరోగ్యం బాగుంటే చాలు  అదే పదివేలు అనిపిస్తుంది.

25 ఫిబ్రవరి 2012

Pure Telugu Girl - పదహారణాల తెలుగు అమ్మాయి

Theme: తన పదహారణాల తెలుగు ప్రేయసిని, ప్రియుడి వర్ణన (A boy describing his lover's(pure telugu girl) beauty in poetic way.)

బొట్టునైన కాకపోతిని,
విశాలమైన ఆకాశం లాంటి నీ నుదుటి పై చందమామ లా వెలిగిపోడానికి.
పుట్టుమచ్చనైనా కాకపోతిని,
పదికాలాలపాటు మేలిమి బంగారపు నీ ఒంటిని అతుక్కుపోడానికి.
ముక్కుపుడకనైనా  కాకపోతిని,
నీ వెచ్చని శ్వాసను ఆశ్వాదించడానికి.
పెదవి రంగునైన కాకపోతిని,
నీ ఆధారాల అందములో తడిసిమువ్వడానికి.
చేవిపోగునైన కాకపోతిని,
అందమైన నీ చెవులను అన్తిపెట్టుకుంటూ ఉండడానికి.
శిరభారణమునైన కాకపోతిని,
నీ హృదయపు లయను వింటూ బతికేయడానికి.
వడ్డానమునైనా కాకపోతిని,
సూక్ష్మమైన నీ నడుముని చుట్టేయడానికి.
గాజులనైనా కాకపోతిని,
సున్నితమైన నీ హస్తములు చేసే పనులకు సవ్వడి చేస్తూ మద్దతివ్వడానికి.
కాలి మువ్వలనైన కాకపోతిని,
నీ పాదపు ప్రతి అడుగునూ అనుసరించడానికి.
పవిటనైనా కాకపోతిని,
పదహారణాల నీ పరువాన్ని దాచుకోడానికి.




22 ఫిబ్రవరి 2012

Love - ప్రేమ - प्यार

నేను చనిపోయాక నామీద నీకు కలిగే గంపెడు జాలికంటే,
నేను బతికుండగా నామీద నీకుండే గుప్పుడే ప్రేమే నాకు కావాలి.

09 ఫిబ్రవరి 2012

ఎన్నికల భారతీయం - Elections in India is a Business

ఎన్నికల భారతీయం - Elections in India is a business
Theme: I am writing my view on dark side of the Elections in India in a poetic way.

కుల మతాల చిచ్చు పెట్టి,
ప్రాంతాల పేర్లు చెప్పి,
డబ్బును పంచిపెట్టి,
మంచిని మరుగున పెట్టి,
మద్యాన్ని పారించి,
ప్రజల స్వేచ్చను హరిస్తూ,
హక్కులను లాక్కుంటూ,
అభివృద్దిని అడ్డుకుంటూ,
మాధ్యమాలకు వెలకట్టి,
ఉచితానుచితా ప్రకటనలు చేస్తూ,
భవిష్యత్తును కాలరాస్తూ,
ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టి,
కోట్లను దండుకోవడం కోసం,
ఓట్లను గుంజుకునే నాటకమే  'ఎన్నికలు'

06 ఫిబ్రవరి 2012

సంతోషమే సగం బలం - Happiness - Success

"సంతోషమే సగం బలం" అన్నారు పెద్దలు...ఆ మాటను గుర్తు చేసుకుంటూ నా అనుభవాన్ని తలచుకుంటూ నేను రాసుకున్న మాట ఇది...


Success may bring you Happiness,
But Happiness always brings you Success.

So be happy always and
chill out every moment,
cheer up every second.