03 ఏప్రిల్ 2012

పొట్టకూటి కోసం పట్టణాల వైపు చూపు - Job searching in cities

పొట్టకూటి కోసం పచ్చని పల్లెటూళ్ళు వదిలి,
వెచ్చని పట్టణాలకు పరుగెత్తుకు వచ్చాము.
పారిపోము మేము ఎంత కష్టము  వచ్చినా,
బెదిరిపోము మేము ఎంత నష్టము వచ్చినా,
సాధించి తీరుతాము అనుకున్న లక్ష్యాన్ని,
భువికి దించుతాము అందమైన  స్వర్గాన్ని.

27 ఫిబ్రవరి 2012

ఆరోగ్యమే మహాభాగ్యం - Health is Wealth

Hitech-city వెళితే అక్కడ ఉద్యోగులను,companyలను చూసి,
ఒక software job కావాలనిపిస్తుంది.
RTC 'X' Roads వెళితే అక్కడ Govt. ఉద్యోగార్తులను(అభ్యర్థులను) చూసి,
ఒక Govt. ఉద్యోగం కావాలనిపిస్తుంది.
Banjara Hills వెళితే అక్కడ దర్జాలు చూసి,
కనీసం ఒక పెద్ద Building, ఖరీదైన car కావాలనిపిస్తుంది.
Ameerpet వెళితే అక్కడ అందమైన అమ్మాయిలను చూసి,
ఒక Girl Friend కావాలనిపిస్తుంది.
కాని ఏదైనా hospital కి వెళ్ళితే అక్కడ patients ను చూసి,
అవన్నీ ఏమి వద్దు రా దేవుడా..... ఆరోగ్యం బాగుంటే చాలు  అదే పదివేలు అనిపిస్తుంది.

25 ఫిబ్రవరి 2012

Pure Telugu Girl - పదహారణాల తెలుగు అమ్మాయి

Theme: తన పదహారణాల తెలుగు ప్రేయసిని, ప్రియుడి వర్ణన (A boy describing his lover's(pure telugu girl) beauty in poetic way.)

బొట్టునైన కాకపోతిని,
విశాలమైన ఆకాశం లాంటి నీ నుదుటి పై చందమామ లా వెలిగిపోడానికి.
పుట్టుమచ్చనైనా కాకపోతిని,
పదికాలాలపాటు మేలిమి బంగారపు నీ ఒంటిని అతుక్కుపోడానికి.
ముక్కుపుడకనైనా  కాకపోతిని,
నీ వెచ్చని శ్వాసను ఆశ్వాదించడానికి.
పెదవి రంగునైన కాకపోతిని,
నీ ఆధారాల అందములో తడిసిమువ్వడానికి.
చేవిపోగునైన కాకపోతిని,
అందమైన నీ చెవులను అన్తిపెట్టుకుంటూ ఉండడానికి.
శిరభారణమునైన కాకపోతిని,
నీ హృదయపు లయను వింటూ బతికేయడానికి.
వడ్డానమునైనా కాకపోతిని,
సూక్ష్మమైన నీ నడుముని చుట్టేయడానికి.
గాజులనైనా కాకపోతిని,
సున్నితమైన నీ హస్తములు చేసే పనులకు సవ్వడి చేస్తూ మద్దతివ్వడానికి.
కాలి మువ్వలనైన కాకపోతిని,
నీ పాదపు ప్రతి అడుగునూ అనుసరించడానికి.
పవిటనైనా కాకపోతిని,
పదహారణాల నీ పరువాన్ని దాచుకోడానికి.