07 జూన్ 2011

lighten up the fire in you for your country

Theme: An energetic lines dedicated to young India to come against the corruption in India
lighten up the fire in you for the country India, LVR Poetry
కదలిరా కదలిరా!
శక్తియుక్తులున్న యువకులారా,
భావి భారత పౌరులారా,
అలుపెరుగని పోరాటానికి, నిరంతర యుద్దానికి.
ఉదయించరా ఉదయించరా సూర్యునివలె!!
అందరికి వెలుగునివ్వడానికి.
తీసుకురా తీసుకురా బయటికి!!
నీలో నివురు గప్పిన నిప్పును,
కాల్చేయడానికి దేశపు అవినీతిని,
దేశ తలరాతను మార్చడానికి,
పరుగెత్తిరా పరుగెత్తిరా!!
కుంటుపడుతున్న అభివృద్దిని పరుగుపెట్టించడానికి.
కొందరిదగ్గర పేరుకుపోతున్న నల్లధనాన్ని అందరికీ పంచేందుకు
దీపమైరా దీపమైరా!!
అవకాశవాదులకు ఆవిరవుతున్న పేదల బతుకుల్లో ఆశాదీపం వెలిగించడానికి.
ఎదురురా ఎదురురా!!
నడుంకట్టి, పిడికిలి బిగించి దృడనిశ్చయంతో,
దుర్మార్గుల మెడలు వంచి, అవినీతి కోరలు పీకేందుకు.

04 జూన్ 2011

Telugu words and meanings

Telugu words and meanings
తెలుగు గడ్డ మీద పుట్టి పెరిగి, మాతృబాష అయిన స్వచ్చమైన తెలుగునే మాట్లాడలేని వాళ్లకు తెలుగును గుర్తుచేసేందుకు ఈ తెలుగు పదాలుగా వాడుకలో ఉన్న  కొన్ని ఆంగ్లపదాలను వాటి అర్థములను ఇక్కడ పొందుపరచు చున్నాను.
  • Thank you, Thanks = కృతజ్ఞతలు
  • sound =శబ్దము
  • practice = సాధన
  • question = ప్రశ్న
  • answer = సమాధానము
  • honesty = నిజాయితి
  • paper = కాగితము
  • news paper = వార్త పత్రిక
  • exams = పరీక్షలు
  • school = బడి, పాఠశాల, విద్యాలయము

03 జూన్ 2011

That's you, That's our friendship

that's you, that's our friendship
గంటల కొద్దీ chat చేయడం,
మూటల కొద్దీ కబుర్లు చెప్పుకోవడం,
satires వేసుకోవడం, tease చేసుకోవడం,
చిన్ని చిన్ని అబద్దాలు చెప్పడం, దొరికిపోతే cover చేసుకోవడం,
జోకులు చేపుకోవడం, పకపక నవ్వడం,
నేను రాసిన కవితలను మొదటగా నీకు చెప్పడం,
నువ్వే మొదటగా comment చేయడం,
ఒకరికొకరు stories చెప్పి నమ్మించడం,
బకరా తెలిశాక ఆశ్చర్యపోవడం,
ఎప్పుడు కలుసుకోకున్నా, ఎప్పుడూ కల్లముందున్నట్లు touch లో ఉండడం,
అది నువ్వు. అది మన  స్నేహం.
కాని దురదృష్టవశాత్తో లేక కలమహిమనో,
నువ్వు అలా లేవు. మన స్నేహం కూడా అలా లేదిప్పుడు.
ఆ నిన్ను నువ్వు miss అవుతున్నావు,
నీ స్వచమైన స్నేహాన్ని నేను miss అవుతున్నా...

08 మే 2011

I miss you my dear

Theme: A boy expresses his feelings when he misses his girl friend.
I miss you my dear
నాతో నువ్వు లేకున్నా,
నీ వెంటే నేనొస్తున్నా.
ఎందుకంత కోపం నీకు,
ఎందుకీ శాపం నాకు.
శాంతిచవా ఇకనైనా,
జాలి చూపవా నా పైన.
నీతో తిరిగిన నా మనసు,
నాతో లేనేలేదిప్పుడు.
నువ్వు తోడుగా లేకున్నా,
నీ నీడననై వస్తున్నా.
నువ్వు నన్నెంత కాదన్నా,
నే నిన్నే కోరుకుంటున్నా.
నాపై నీకెంత ద్వేషమున్నా,
నేను నీ స్నేహాన్నే కోరుకుంటున్నా......