22 నవంబర్ 2012

Our Relationship is Beautiful

సూర్యుడి వెలుగు అనంతం,
శివుడి మూడోకన్ను  అతీతం,
వినాయకుని తొండం అద్వితీయం,
ఆంజనేయుని తోక అద్భుతం,
నాన్న కోపం అక్షర సత్యం,
అమ్మ ప్రేమ అపరిమితం,
అక్క ఆప్యాయత అపురూపం,
తమ్ముడి అలక అరక్షణం,
మన స్నేహం మన జీవితానికి అందం, ఆనందం.

17 నవంబర్ 2012

Nandi Hills - నంది కొండలు


మేఘాలు కొండలను ముద్దాడుతుంటే,
ఆకాశం భూమిని హత్తుకుంటుంటే..
పొగమంచు చెవిని తాకుతుంటే..
ఒంటిమీది రోమాలు నిలబడి నాట్యం చేస్తుంటే..
ప్రకృతి అందాలు అలరిస్తుంటే,
జంతువుల అల్లరికి ఒళ్ళు పులకరిస్తుంటే..

అంతకన్నా అందమెక్కడుంటుంది
ఆనందం ఎక్కడ దొరుకుంతుంది...

అదే భూతల స్వర్గం 'నంది కొండలు'

13 నవంబర్ 2012

Happy Diwali - దీపావళి శుభాకాంక్షలు


దీపాల వెలుగులు మీ జీవితలంలోని చీకటిని పారద్రోలాలని,
తారాజువ్వలు మీ 'కీర్తి'ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాలని,
టపాకాయల శబ్ధం మీలోని మౌనాన్ని చేధించాలని,
రంగులు మీ జీవితాన్ని అందంగా, ఆనందంగా చేయాలని,

కోరుకుంటూ
నీకు మరియు మీకుటుంబ సుభ్యులకు 'దీపావళి శుభాకాంక్షలు'

ఇట్లు,
మీ  విశ్వనాధ్

11 నవంబర్ 2012

భక్తి - ప్రేమ


ఒకడు పొరుగు దేశాన్ని తిడితే, వాడికి మన దేశం మీద భక్తి ఉన్నట్లు కాదు,
పక్కవాడి గురించి చెడుగా మాట్లాడితే, మనమీద ప్రేమ ఉన్నట్లు కాదు.