22 ఫిబ్రవరి 2011

Famous English Quotes collection

I collected and posted these quotes from my Brother Koteswara Reddy's book.


Known is a drop, Unknown is an Ocean,
Who knows oneself knows everything.


Friendship is like a shadow, which lives with us forever
Knowledge is a potential power, wisdom is a real power


Opportunity only knocks once, the next one may be better or worse but never the same one.


Success doesn't mean the absence of failures, it means the attainment of ultimate objectives, it means winning the war not every battle.

09 ఫిబ్రవరి 2011

I love your sweet voice

Theme: Words of a boy while he praises his soul-mate's voice
అలసి పోయేంత వరకూ క్రికెట్ ఆడినట్లుగా,
చలిలో కూడా చెమటలు పట్టేలాగా వ్యాయామం చేసినట్టుగా,
గొంతు అరిగిపోయెంతవరకు పాటలు పాడినంతగా,
కడుపు నిండేవరకు ఆహరం తిన్నంతగా,
అందరూ మెచ్చుకునేంతగా కవిత్వం రాసినట్టుగా,
అందరూ పోగిడెంతగా నాట్యం చేసినట్టుగా,
తిరుపతి లడ్డు ఉన్నంత కమ్మగా,
అంత ఆనందంగా ఉంది నీ తీయనైన గొంతు వింటుంటే.....
ఇలాగే నీ గొంతును వింటూ కలకాలం గడిపేయాలని కోరుకుంటున్నాను.....

08 ఫిబ్రవరి 2011

Never worry about the things you did not have, Live happily

Theme: A few words to all, to live happily.
సంతోషంగా బతికేయి......
ప్రేరణ: మా అన్న కోటేశ్వర రెడ్డి, ఎపుడూ చెప్తుంటాడు లేని వాటిని తలచుకొని బాధపదేటప్పుడు ఒకసారి వైద్యశాలల్లో జబ్బులతో బాధపడే వాళ్ళను తలచుకుని, ఉన్న వాటితో సంతోషంగా జీవించమని,
ఆ మాట కలిగించిన ప్రేరణతో ఈ కవితను రాశా...!

Never worry about the things you did not have, Live happily
Its never late to live happily
కారు లేదని బాధపడకు మిత్రమా,
నడవడానికి కాళ్ళు కూడా లేని వాళ్ళున్నారని తెలుసుకో,
రాజసానికి భవంతులు లేవని చింతించకు మిత్రమా,
తల దాచుకోడానికి గుడిసె కూడా లేనివల్లున్నారని మరువకు,
విలాసాలకు డబ్బులేదని శోచించకు మిత్రమా,
అవసారాలకు కూడా డబ్బు లేని వాళ్ళుకూడా ఉన్నారని గుర్తుంచుకో,
ఒక్క పూట కూడా బిర్యాని తినడం లేదని బాధపడకు మిత్రమా,
ఒక్క పూట కూడా భోజనం చేయలేని వారెందరున్నారో తలచుకో,
లక్షల్లో జీతాలు రావట్లేదని చింతించకు మిత్రమా,
లక్షల్లో నిరుద్యోగులు ఉన్నారని గుర్తుంచుకో,
స్విస్ బాంకుల్లో డబ్బు దాచుకోలేకపోతున్నానని రోదించకు మిత్రమా,
వైద్యశాలల్లో జబ్బులతో బాధపడే వాల్లనోకసారి తలచుకో.
ప్రయతిస్తే పోయేది శూన్యం,
బాధపడితే వచ్చేది నైరాశ్యం.

07 ఫిబ్రవరి 2011

I could not be a poet to describe your beauty

Theme: A boy praising his girl's beauty
holding hands forever, no matter i promise, i love you
I hold your hand forever
అంతులేనిది ఆశ, నువ్వే నా శ్వాస
సరిపోదు ఈ బాష నిను వర్ణించడానికి,
కానీ ప్రయత్నం చేశా.....
ఓ మానసా....!
నేను కవి నైన కాకపోతిని, నీ అందాన్ని వర్ణించడానికి,
శిల్పి నైన కాకపోతిని, నీ రూపాన్ని శిల్పంలా చెక్కడానికి,
నీ ఊపిరినైన కాకపోతిని, నీ గుండెల నిండుగా ఉండడానికి,
నీ గుండెనైన కాకపోతిని, నీ కోసం ప్రతి క్షణం కొట్టుకోవడానికి,
బ్రహ్మ నైన కాకపోతిని, నీలాంటి ఇంకొక రూపాన్ని స్ప్రుష్టించడానికి,
కాని జన్మ జన్మలకు ఎలాంటి కష్టమెదురైన నీ చేయిని వదలనని నీ చేతిలోన చెయ్యేసి నే మాటిస్తున్నా..