10 ఆగస్టు 2011

protest is not meant for violence

పేదోళ్ళ పోట్టకొడుతూ,
సామాన్యుల నడ్డి విరచడం కాదు ఉద్యమం అంటే.
విద్యార్థులను రోడ్డు పైకి తెస్తూ, ఆపైన కటకటాల వెనక్కి నెట్టేస్తూ,
వారి ఉజ్వల భవిష్యత్తుని గాఢ అంధకారం లోకి తోయడం కాదు ఉద్యమం అంటే.
ఇల్లు గడవక, పని దొరకక,
కడుపు నిండక రోదించే నిరుపేదల ఆకలి కేకలు కాదు ఉద్యమం అంటే.
నడిచే అభివృద్దిని వెనక్కి తోస్తూ,
భవిష్యత్తును భూతకాలం లోకి తీసుకెళ్లడం కాదు ఉద్యమం అంటే.
పచ్చగా ఉండాల్సిన మట్టిని,
నెత్తుటితో ఎర్రగా మార్చడం కాదు ఉద్యమమంటే.
వెనకున్న చరిత్ర కాదు, ముందు ఉన్న భవిత ముఖ్యం,
నాయకుల ఆశలు కాదు, ప్రజలకున్న ఆశయాలే ముఖ్యం.
సమరం కాదు సామరస్యతే ముఖ్యం,
హింస కాదు ముఖ్యం శాంతి స్థాపనే లక్ష్యం,
ప్రాంతాలు కాదు సర్వజనుల హితమే ముఖ్యం.