08 ఫిబ్రవరి 2011

Never worry about the things you did not have, Live happily

Theme: A few words to all, to live happily.
సంతోషంగా బతికేయి......
ప్రేరణ: మా అన్న కోటేశ్వర రెడ్డి, ఎపుడూ చెప్తుంటాడు లేని వాటిని తలచుకొని బాధపదేటప్పుడు ఒకసారి వైద్యశాలల్లో జబ్బులతో బాధపడే వాళ్ళను తలచుకుని, ఉన్న వాటితో సంతోషంగా జీవించమని,
ఆ మాట కలిగించిన ప్రేరణతో ఈ కవితను రాశా...!

Never worry about the things you did not have, Live happily
Its never late to live happily
కారు లేదని బాధపడకు మిత్రమా,
నడవడానికి కాళ్ళు కూడా లేని వాళ్ళున్నారని తెలుసుకో,
రాజసానికి భవంతులు లేవని చింతించకు మిత్రమా,
తల దాచుకోడానికి గుడిసె కూడా లేనివల్లున్నారని మరువకు,
విలాసాలకు డబ్బులేదని శోచించకు మిత్రమా,
అవసారాలకు కూడా డబ్బు లేని వాళ్ళుకూడా ఉన్నారని గుర్తుంచుకో,
ఒక్క పూట కూడా బిర్యాని తినడం లేదని బాధపడకు మిత్రమా,
ఒక్క పూట కూడా భోజనం చేయలేని వారెందరున్నారో తలచుకో,
లక్షల్లో జీతాలు రావట్లేదని చింతించకు మిత్రమా,
లక్షల్లో నిరుద్యోగులు ఉన్నారని గుర్తుంచుకో,
స్విస్ బాంకుల్లో డబ్బు దాచుకోలేకపోతున్నానని రోదించకు మిత్రమా,
వైద్యశాలల్లో జబ్బులతో బాధపడే వాల్లనోకసారి తలచుకో.
ప్రయతిస్తే పోయేది శూన్యం,
బాధపడితే వచ్చేది నైరాశ్యం.