14 జనవరి 2015

భోగి మకర సంక్రాంతి కనుమ - Bhogi Makara Sankranthi Kanuma

భోగి మకర సంక్రాంతి కనుమ - Bhogi Makara Sankranthi Kanuma
పంటలు నిండిన గానుగలు,
బంధువులు నిండిన ఇల్లు,

చలిని చీల్చుతూ,
బాధలను మరిపిస్తూ,
గతాన్ని కాలరాస్తూ,
కొత్త  ఉత్తేజాన్నిచ్చే భోగి మంటలు.

గొబ్బెమ్మలు నిండిన ముగ్గులు,
రంగురంగుల ముగ్గులు నిండిన వీధులు,
జీవితం హరివిల్లులా ఉండాలని చూపించే వీధులు.

కన్నుల పండుగగా నిలచె కనుమ.
సంతోషం, సంతృప్తి తో నిండిన రైతుల మనసులు...

నోరూరించే మిఠాయిలు,
ఘుమఘుమలాడే వంటకాలు.
రెపరెపలాడే గాలి పటాలు,

వాతావరణంలోనే కాక జీవితంలో కూడా మార్పులు తెచ్చే పండుగ మకర సంక్రాంతి...

త్వరలోనే మళ్ళీ ప్రతియేటా రైతులందరూ సంతోషంగా సంక్రాంతి పండుగ జరుపుకుంటారని ఆశిస్తూ ...
మీకు మరియు మీ కుటుంభ సభ్యులకు భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు

స్తితిగతి మార్చండి పేరును కాదు..change fate of area not its name

అయ్యా!! బాలయ్య గారు మరియు మిగతా రాజకీయనాయకులు,
మిమ్ములను ఎన్నుకున్నది మా ప్రాంతాలకు పేర్లు మార్చమని కాదు, మా ప్రాంతాల స్థితిగతులను మార్చమని. 
మీరేమో అనంతపురం జిల్లా ఏమి చేయాలో ఆలోచించడం మానేసి జిల్లాని ఎలా విడగొట్టాలి, విడగొట్టి వాటికి మా నాన్న పేరు ఎలా పెట్టాలి అని ఆలోచిస్తున్నారు. 
హిందూపురం నుండి మీ నాన్న గారు, మీ అన్న గారు ఇప్పుడు మీరు ఎన్నికయ్యారు ఎం లాభం అప్పుడెల ఉందొ ఇప్పుడు అలానే ఉంది. మీరు అభివృద్ధి, సమస్యల పరిష్కారం పట్టించుకోకుండా ఇలా నామకరణం మీద ఎందుకు శ్రద్ధ చూపిస్తున్నారో అర్థం కావట్లేదు. 
మంచి చేస్తే ప్రజల గుండెల్లో ఉంటారు దానికోసం ఊరిపేర్లు మార్చక్కర్లెదు... కావాల్సివస్తే ప్రజలే కోరుకుంటారు. 
అనవసరంగా మీరు కూడా యు.శ్రా.రై  (వైయస్ఆర్ పార్టీ ) రాజకీయ పక్షం లాగ తల్లిదండ్రుల పేరును ఒక వస్తువులా  ప్రచారం/వ్యాపారం చేయోద్దండి. 


మీరు ఈ పై అంశాల గురించి ఆలోచిస్తారని ఆశిస్తూ,
విశ్వనాధ్
మీరేదో మంచి చేస్తారని ఆశించి ఓటు వేసిన సామాన్యుడు.


13 జనవరి 2015

ఆంధ్రప్రదేశ్ రాజధాని - పారదర్శకత - Transparency in AndhraPradesh capital city construction

మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు,

1. ప్రధాని నరేంద్రమోడి గారు "భారత్ లో తయారీ " అని ఒకపక్క ప్రయత్నిస్తుంటే,మీరు ఈ సువిశాల భారత దేశంలో ఎవరూ రాజధాని నిర్మించాలేరని సింగపూర్ వారినే ఎందుకు రాజధాని నిర్మించమని అడుక్కున్తున్నారో మాకు అర్థం కావట్లే? ప్రపంచానికే సాంకేతికతను అందిస్తున్న ఈ భారత దేశం ఎందుకూ  పనికిరాద?

2. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం సింగపూరు ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం వివారాలు వేల్లదిన్చాకపోవడమెనా?
రాజధాని ప్రణాళిక కోసం మొత్తం ఎంత డబ్బు చెల్లిస్తున్నారు సింగపూర్ కి ?
లేదంటే అంతే విలువైన ప్రయొజనాలెమైన కేటాయిస్తున్నారా ?
ఇవన్నీ ప్రజలకు తెలపకపొవడమేనా  పారదర్శకత అంటే?

ప్రతిపక్ష నేత జగన్ గారు,

ముఖ్యమంత్రి గారు అవన్నీ చేస్తుంటే మీరు ఓదార్పు యాత్రలు చేస్తూ ఉండడమేనా లేక ఏమైనా పద్దతిగా నిలదీసేదేమైన ఉందా?

మీరు ఈ పై అంశాల గురించి ఆలోచిస్తారని ఆశిస్తూ,
విశ్వనాధ్
మీరేదో మంచి చేస్తారని ఆశించి ఓటు వేసిన సామాన్యుడు.

01 జనవరి 2015

ఈ కాలపు యువత - Todays Youth

ఈ కాలపు యువత..

మత్తులో తేలుతూ
వీధుల్లో తూలుతూ
పిచ్చిపిచ్చిగా రంకలేస్తూ
జల్సాలకు బానిసలై

అవినీతికి తలవంచే
అన్యాయానికి ఆయుధమయ్యే
రాజకీయాలకు బలయ్యే
హత్యా,అత్యాచారాలలో ఇరుక్కునే

ఆరోగ్యం పై శ్రద్దలేని
ఆలోచలనల్లో స్పష్టతలేని
ఆచరణల్లో మార్పులేని
కళ లేని, కల లేని
అవకాశాలు అందుకోలేని

వీళ్ళా? నా ఈ దేశాన్ని మార్చేది ?
వీళ్ళా? నా ఈ ప్రపంచాన్ని నడిపించేది?