30 జూన్ 2010

Be Proud To Be a Women

Mother Teresa
ఆడజన్మ ఎత్తినందుకు గర్వించు........

ఆడజన్మ ఎత్తినందుకు గర్వించు........
అమ్మాయిగా పుట్టినందుకు ఆనందించు,
తల్లివైనందుకు సంతోషించు.
తల్లి థెరిస్సా ను కాకపోతిని తల్లిలా సేవ చేయడానికి........
ఝాన్సీ లక్ష్మిభాయిని  కాకపోతిని బ్రిటిష్ వారితో పోరాడడానికి.....
లతా మంగేష్కర్ ను కాకపోతిని కోకిలలా పాటలతో ప్రపంచాన్ని ఓలలాడించడానికి...........
ఒక తల్లినైన కాకపోతిని ఒక అబ్దుల్ కలాం నైన ఈ దేశానికివ్వడానికి..........
కిరణ్ బేడి నైన కాకపోతిని మొదటి IPS అవ్వడానికి.............
రాణి రుద్రమ దేవి నైన కాకపోతిని రౌద్రంగా యుద్ధం చేయడానికి.........

26 మే 2010

I Wanna be..............

I Wanna be..............

I wanna be the person, who cares you a lot,
I wanna be your shade, which follows you always,
I wanna be the person, with whom you talk always,
I wanna be the person, with whom you share all of your feelings,
I wanna be the person, who makes you smile even if you are feeling sad,
I wanna be the person, who lightens your life even in the deep darkness,
I Wanna be your best friend, with whom you never hesitate to say anything.

20 మే 2010

what to say....how to say.....

ఏమని చెప్పను..............ఎలా చెప్పను.............

ఏమని చెప్పను..............ఎలా చెప్పను.............
కడవరకు నీతోనే ఉంటానని కళ్ళతో చెప్పనా......
కాళిదాసు లాగ కవిత్వం రాయనా....
మగధీరుడి లాగ మరిపిస్తూ చెప్పనా.........
పదికాలాలపాటు నీతోడుగా ఉంటానని నీ స్వచమైన పాదాల మీద ఒట్టేసి చెప్పనా.....
ఏమని చెప్పను..............ఎలా చెప్పను.............
కటిక చీకటిలో కూడా కొవ్వొత్తిలా వెలుగు చూపిస్తానని చెప్పనా......
జడివానలో గోడుగునవుతానని చెప్పనా..........
మండుటెండలో మంచినీటిని అవుతానని చెప్పనా.....
గగుర్పొడిచే చలిలో నీఒంట్లో వేడినవుతానని చెప్పనా.......
నిను మౌనమేలే సమయంలో నిను మైమరిపించే మాటనవుతానని చెప్పనా.......
నీవు దుఖసంద్రంలో ఉంటె నీ కన్నీరు తుడిచే చేయినవుతనని చెప్పనా.........
ఏమని చెప్పను..............ఎలా చెప్పను.............
నీవు నాట్యం చేసే వేల నీ కాలి మువ్వలనవుతానని చెప్పనా..........
నీవు ఒంటరనుకునేవేళ నీతో నడిచే పాదమవుతనని చెప్పనా............
నీవు బాధలో కార్చే కన్నీటి బొట్టునవుతానని చెప్పనా...........
ఎప్పుడూ నిను అనుసరించే నీ నీడనవుతనని చెప్పనా.........
ఎప్పుడూ నువ్వ్వు పీల్చే శ్వాసనవుతానని చెప్పనా.......

16 మే 2010

the day has came....which i didn't want

నేను అనుకోలేదేనాడు ఇలాంటి రోజొకటి వస్తుందని..........
నా స్నేహితులను నానుండి దూరం చేస్తుందని ....
నా గుండె నిండా బాధని నింపుతుందని.........
ఆ రోజు రానే వచ్చింది, విడిపోయే రోజు.
అందరిని దగ్గరికి తెచ్చింది విడిపోవడానికి.
ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ కలిసి చదివాం, ఆడాం, పాడాం, అల్లరి పనులు చేసాం, తిరిగాం, పోట్లడాము,  కలిసిపోయాం.
మిమ్మల్ని కలవని ముందు రోజు వరకూ...
ఈ నాలుగు సంవత్సరాలు నాల్గు యుగాలుగా మిగిలిపోతాయి అనుకున్న.
కాని నాలుగు క్షణాలుగా కరిగిపోతాయని అనుకోలేదు.
ఇలా నా ఎదను మీ జ్ఞాపకాలతో నింపుతాయనుకోలేదు.


ఇదే నా అపూర్వమైన స్నేహితులకు నా మనః పుష్పాభినందనములు,
ఇట్లు మీ స్నేహితుడు మరియు శ్రేయోభిలాషి,
విశ్వనాధ్ రెడ్డి.