07 ఫిబ్రవరి 2011

I could not be a poet to describe your beauty

Theme: A boy praising his girl's beauty
holding hands forever, no matter i promise, i love you
I hold your hand forever
అంతులేనిది ఆశ, నువ్వే నా శ్వాస
సరిపోదు ఈ బాష నిను వర్ణించడానికి,
కానీ ప్రయత్నం చేశా.....
ఓ మానసా....!
నేను కవి నైన కాకపోతిని, నీ అందాన్ని వర్ణించడానికి,
శిల్పి నైన కాకపోతిని, నీ రూపాన్ని శిల్పంలా చెక్కడానికి,
నీ ఊపిరినైన కాకపోతిని, నీ గుండెల నిండుగా ఉండడానికి,
నీ గుండెనైన కాకపోతిని, నీ కోసం ప్రతి క్షణం కొట్టుకోవడానికి,
బ్రహ్మ నైన కాకపోతిని, నీలాంటి ఇంకొక రూపాన్ని స్ప్రుష్టించడానికి,
కాని జన్మ జన్మలకు ఎలాంటి కష్టమెదురైన నీ చేయిని వదలనని నీ చేతిలోన చెయ్యేసి నే మాటిస్తున్నా..

29 జనవరి 2011

Do not waste your valuable Time

Theme: Reminding the value of time in heart touching manner
వృధా చేయకు మిత్రమా....
విలువైన నీ సమయాన్ని,
కాలరాయకు మిత్రమా
ప్రతి క్షణం జరిగే దేశాభివ్రుద్దిని,
వృధా చేయకు మిత్రమా
మన బవిష్యత్తు కోసం అనుక్షణం శ్రమించే మన తల్లిదండ్రుల ఆసిస్సులను,
ఎపుడూ నీ శ్రేయస్సు కోసం తపించే నీ స్నేహితుల ఆశలను,
వృధా చేయకు మిత్రమా....
మన కోసం సరిహద్దుల్లో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా రేయింబవళ్ళు కాపు కాసే సైనికుల తెగింపుని,
మనకు మూడు పూటలా తిండి పెట్టడం కోసం రెక్కలు ముక్కలయ్యేలా పని చేసే రైతు కష్టాన్ని,
దేశ దశదిశలను మార్చగలిగే నీ యువ శక్తియుక్తులను,
నీకోసమే ఎదురు చూస్తున్న అవకాశాలను,
మన పెద్దవాళ్ళు తెచిన స్వాతంత్ర్య, స్వేచ్చలను,
మన పూర్వికులు సాధించిన నాగరికతను,
మన సంస్కృతి నేర్పిన పాఠాలను.

17 జనవరి 2011

My own quotes and own thoughts which I experienced and I believe

I am still alive means, i have something to achieve and I am have been healthy means i can achieve anything.


Why people find one reason to die,
why don't they see even one small reason to live......


Meeting new people is always interesting,
meeting old people is always Happy.


If you are doing something to impress others, then you are not giving your best,
if you are trying to satisfy yourself, then only you will your best. I believe in it.


A day without a laugh is a day wasted.
-Charlie Chaplin
A day without chatting with you is a day wasted
- Boy Friend
A day without logging into FaceBook is a day wasted
- FB lovers

23 డిసెంబర్ 2010

Maro Kalala prapanchanni Sadiddam Nava Samaajaanni Nirmiddaam

మరో ప్రపంచం......!



అవినీతి, అసత్యం, మద్యం, డబ్బు ఏలుతున్న ఈ రాజ్యంలో,
అడుగడుగునా దౌర్జ్జన్యం,
ఎటు చూసిన అన్యాయం,
ప్రగతి మాటున పడతి ఫై పెరిగిన దౌర్జ్జన్యాలు,
ప్రతి నిమిషమూ దోచుకోవడం గురించే ఆలోచించే నాయకులు,
ఎప్పుడూ తమ స్వార్థం కోసం విష ప్రచారాలు(ప్రసారాలు) చేసే మాధ్యమాలు,
మానవత్వాన్ని మరిచి చెలరేగి పోతున్న కిరాతకులు,
ఏమి చేయలేక నిరాశ, నిస్పృహలలో ప్రజలు,
పగటి పూట పదిమందిలో స్వేచ్చగా తిరగలేని స్త్రీ, అర్దరాత్రి ఒంటరిగా తిరిగే దెన్నడు?
ఇదేనా శ్రీశ్రీ చెప్పిన మరో ప్రపంచం?
ఇదేనా గాంధీజీ తెచ్చిన స్వాతంత్ర్యం?
ఇదేనా నెహ్రు కలలు కన్న సామ్రాజ్యం?
ఇదేనా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం?
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఆశించడం వ్యర్థమని తేలిపోయింది,
మరో ప్రపంచం కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమయింది.
అందరం ఒకటిగా పోరాడుదాం,
కలల ప్రపంచాన్ని సాదిద్దాం,
అసలైన ప్రజాస్వామ్యాన్ని స్థాపిద్దాం.
నవసమాజాన్ని నిర్మిద్దాం.