06 డిసెంబర్ 2010

oh dear i will be your shadow

నీ నీడనయి నేను....
Theme: A boy proposing a girl by saying that how he looks after her.

ఓ ప్రియా...........!
కన్నీళ్లు తుడిచి ఓదార్చే అమ్మలా,
ఎప్పుడూ వెన్నంటి ఉండే నాన్నలా,
వెన్నుతట్టి ప్రోత్సహించే తోబుట్టువులా,
ఆపదలో ఆడుకునే స్నేహితుడిలా,
ఎల్లప్పుడూ నీ మంచిని కోరుకునే శ్రేయోభిలాషిలా,
ప్రేమించడంలో మన్మధుడిలా,
జన్మ జన్మలకు నీతోనే ఉంటా,
నిన్ను మహరాణిలా చూసుకుంటా,
కంటికి రెప్పలా కాపాడుకుంటా.
నా కంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తా,
నీ కోసం నా ప్రాణమైన అర్పిస్తా.

23 నవంబర్ 2010

Nuvvu....!! Nenu kaani vela

నువ్వు....!! నేను కాని వేళ............!
Nuvvu....!! Nenu kaani vela a poem by Viswanath (LVR)
Theme: Feelings of a boy when he came to know that he can't live with his beloved anymore.

నన్నెందుకు ప్రేమించలేదంటూ నువ్వు కళ్ళతో నన్ను అడిగిన క్షణం....
నువ్వే నా ప్రాణమంటూ నీకు సమాధానం చెప్పలేని ఆ క్షణం,
మౌనమే నా సమాధానమంటూ నా గొంతు మూగబోయిన క్షణం,
నా పాదాలు నీతో నడవలేవని తెలిసిన...మరుక్షణం
నా చేతులు నీ కన్నీళ్లను తుడవలేని తక్షణం,
నువ్వు నా సొంతం కాదని తెలిసినప్పుడు నా మనసు చలించింది
నా మనసు నన్ను నిలదీసిన ఆక్షణం నా జీవితం వ్యర్తమనిపించింది
నేనెక్కడున్నా... నా మనసు మాత్రం ఉంటుంది నీతోనే
మరుజన్మంటూ ఉంటే అది నీ స్నేహితుడిగానే
ఎన్ని జన్మలకైనా నేను నీ చేతిలోన చెయ్యేసి జీవితాంతం నీకు తోడుగా ఉంటానని ఆశిస్తూ........
ఎల్లప్పుడూ నీ సంతోషాన్ని కోరుకునే,
నీ శ్రేయోభిలాషి.

22 ఆగస్టు 2010

I will leave the heaven if you are not there, i will make Heaven in the hell if you are with me

నీవు లేకుంటే స్వర్గామైన అది నాకు నరకం, నీవుంటే నరకమైన అది నాకు స్వర్గమే...............
Theme:Feelings of a boy when he met his beloved after few days being away due to some situations.

నీతో మాటలాడని ప్రతి క్షణం నాకొక యుగం,
నేను రెక్కలు తెగిన పక్షిలా,
ఒడ్డున పడిన చేపలా,
నీట మునిగిన పడవలా,
పంజరంలో బంధించబడిన చిలుకలా బతికాను,
నిను కలిసిన మరుక్షణం,
అప్పుడే పుట్టిన లేగదూడలా,
కొత్తగా నడక నేర్చిన చిన్న పిల్లాడిలా,
అప్పుడే బయటకోచిన సీతాకోకచిలుకలా,
ఎగిసి పడుతున్న అలలా,
జల జల పారుతున్న సెలయేరులా,
చాలా రోజుల తర్వాత ఊపిరి తీసుకున్నట్లుగా,
నా మనసు ఆనందంతో పరవశిస్తోంది.

02 ఆగస్టు 2010

Friendship is life, Life is Friendship

స్నేహమేరా జీవితం, జీవితమే స్నేహం...........

ఒకే తల్లికి పుట్టని కవలలే స్నేహితులంటే..........
స్నేహానికి మతం లేదు, కులం లేదు,
డబ్బు అడ్డురాలేదు,
ఆడ, మగ భేదం లేదు,
చిన్న, పెద్ద తేడా లేదు,
స్నేహానికి బాష అవసరం లేదు, భావమే ముఖ్యం,
రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు, రెండు మనసులు కలిస్తేనే స్నేహం,
స్నేహానికి నమ్మకమే పునాది, అనుమానమే సమాధి,
తల్లిదండ్రులు లేని వాడు కాదు అనాధ, స్నేహితులు లేని వాడే అనాధ,
మన తల్లి దండ్రులను మనము ఎంచుకోలేము,
కాని మంచి స్నేహితులను వెతుకోవచ్చు,
స్నేహమందించును ఆనందం, అది నిలిచెను కలకాలం,
స్నేహమే జీవితం, జీవితమే స్నేహం.