16 డిసెంబర్ 2012

Good or Bad Habit is after all a habit


మంచైనా,చెడైన అలవాటు ఉండడం తప్పు కాదు,
కాని దానికే బానిసవడం మంచిది కాదు.

దేన్నైనా నువ్వు శాశించగలిగేలా ఉండాలి,
ఏ అలవాటునైన మానేయగాలగాలి.

15 డిసెంబర్ 2012

Living life is an art


చేసేపనినే అందంగా చేస్తే అదే కళ,
మాటనే మురిపెంగాచెప్తే అదే కవిత
మాటలను వినసొంపుగా పాడితే అదే పాట,
లయబద్దంగా ఒళ్ళు కదిలిస్తే అదే నాట్యం

జీవితం ఒక కళ, జీవించడమే ఒక కళ.
అందంగా, ఆనందంగా గడిపేస్తే అదే జీవితం.


03 డిసెంబర్ 2012

దేశ బాషలందు తెలుగు లెస్స - Desha baashlandu telugu lessa

Desha baashlandu telugu lessa - దేశ బాషలందు తెలుగు లెస్స
అమ్మ ప్రేమ కమ్మదనం తెలుగు,
రైతన్న తలపాగా తెలుగు,
కుమ్మరి మట్టివాసన తెలుగు,
జొన్న,రాగి సంగటి రుచి తెలుగు,
పొలాల్లో వినిపించే జానపదం తెలుగు.

వీరబ్రహ్మం కాలజ్ఞానం తెలుగు,
శ్రీకృష్ణదేవరాయ వెలుగు తెలుగు,
తెనాలి తెలివితేటలు  తెలుగు,
కందుకూరి ఆశయం తెలుగు,
పోతన రచన తెలుగు,
మొల్ల కవిత్వం తెలుగు,
వేమన పద్యం తెలుగు,
శ్రీశ్రీ భావం తెలుగు.

మాటలు రాని పసిబిడ్డ ఏడుపు తెలుగు,
పరువాలోలికే  ఆడపిల్ల సిగ్గు తెలుగు,
కండలు తిరిగిన యువకుని అహం తెలుగు,
మగరాయుల పట్టు పంచెకట్టు తెలుగు,
పోగరైన మీసకట్టు తెలుగు,
ఆడపడచుల  పసుపు పారాణి తెలుగు.

పున్నమి వెన్నెల ఆహ్లాదం తెలుగు,
వసంతంలో పక్షుల కిలకిల రావాలు తెలుగు,
పేరంటాళ్ళలో మగువల రాగాలు తెలుగు,
పండుగనాడు పచ్చటితోరణాలు తెలుగు,
రకరకాల రుచులుండే  ఉగాది పచ్చడి తెలుగు,
పోగారుబట్టిన పోట్లగిత్త బలం తెలుగు,
పవిత్రమైన గోమూత్రం తెలుగు.

తేనెలొలుకు మాటలు తెలుగు.
మదినిదోచే ముచ్చటైన బాష తెలుగు.

పరబాష జ్ఞానాన్ని సంపాదిద్దాం,
కాని మాత్రుబాష లోనే సంభాషిద్దాం .

తెలుగువాడిగా పుట్టాం,పెరిగాం,
తెలుగు వాడిగానే జీవిద్దాం .

దేశ బాషలందు తెలుగు లెస్స