16 డిసెంబర్ 2012

Good or Bad Habit is after all a habit


మంచైనా,చెడైన అలవాటు ఉండడం తప్పు కాదు,
కాని దానికే బానిసవడం మంచిది కాదు.

దేన్నైనా నువ్వు శాశించగలిగేలా ఉండాలి,
ఏ అలవాటునైన మానేయగాలగాలి.

15 డిసెంబర్ 2012

Living life is an art


చేసేపనినే అందంగా చేస్తే అదే కళ,
మాటనే మురిపెంగాచెప్తే అదే కవిత
మాటలను వినసొంపుగా పాడితే అదే పాట,
లయబద్దంగా ఒళ్ళు కదిలిస్తే అదే నాట్యం

జీవితం ఒక కళ, జీవించడమే ఒక కళ.
అందంగా, ఆనందంగా గడిపేస్తే అదే జీవితం.


03 డిసెంబర్ 2012

దేశ బాషలందు తెలుగు లెస్స - Desha baashlandu telugu lessa

Desha baashlandu telugu lessa - దేశ బాషలందు తెలుగు లెస్స
అమ్మ ప్రేమ కమ్మదనం తెలుగు,
రైతన్న తలపాగా తెలుగు,
కుమ్మరి మట్టివాసన తెలుగు,
జొన్న,రాగి సంగటి రుచి తెలుగు,
పొలాల్లో వినిపించే జానపదం తెలుగు.

వీరబ్రహ్మం కాలజ్ఞానం తెలుగు,
శ్రీకృష్ణదేవరాయ వెలుగు తెలుగు,
తెనాలి తెలివితేటలు  తెలుగు,
కందుకూరి ఆశయం తెలుగు,
పోతన రచన తెలుగు,
మొల్ల కవిత్వం తెలుగు,
వేమన పద్యం తెలుగు,
శ్రీశ్రీ భావం తెలుగు.

మాటలు రాని పసిబిడ్డ ఏడుపు తెలుగు,
పరువాలోలికే  ఆడపిల్ల సిగ్గు తెలుగు,
కండలు తిరిగిన యువకుని అహం తెలుగు,
మగరాయుల పట్టు పంచెకట్టు తెలుగు,
పోగరైన మీసకట్టు తెలుగు,
ఆడపడచుల  పసుపు పారాణి తెలుగు.

పున్నమి వెన్నెల ఆహ్లాదం తెలుగు,
వసంతంలో పక్షుల కిలకిల రావాలు తెలుగు,
పేరంటాళ్ళలో మగువల రాగాలు తెలుగు,
పండుగనాడు పచ్చటితోరణాలు తెలుగు,
రకరకాల రుచులుండే  ఉగాది పచ్చడి తెలుగు,
పోగారుబట్టిన పోట్లగిత్త బలం తెలుగు,
పవిత్రమైన గోమూత్రం తెలుగు.

తేనెలొలుకు మాటలు తెలుగు.
మదినిదోచే ముచ్చటైన బాష తెలుగు.

పరబాష జ్ఞానాన్ని సంపాదిద్దాం,
కాని మాత్రుబాష లోనే సంభాషిద్దాం .

తెలుగువాడిగా పుట్టాం,పెరిగాం,
తెలుగు వాడిగానే జీవిద్దాం .

దేశ బాషలందు తెలుగు లెస్స 

25 నవంబర్ 2012

Love Quotes - ప్రేమ - प्यार

You have been my best friend till now,
will you become my better half from now.

So many girls walked in-front of my eyes,
but You walked directly into my heart.

నానుండి దూరంగా వెళితే, నువ్వు బాగుండాలని మాత్రమె కోరుకోగలను,
కాని నాతోనే ఉంటే, నువ్వు బాగుండేలా చూసుకోగలను.

You have been in my life till now,
Will you be my life from now Dear.

I bowled so many batsmen with deadly Yorkers,
but you clean bowled me with your Sweet Smile

When I was walking straight, you walked towards me,
when I started walking towards you, You are walking away....
I know, You are walking away slowly to come back furiously.


If you are away from me, You may stay Happy alone,
But if you are with me, We will be happy Forever Together.
I love you dear...You are my life...You are my soul..

22 నవంబర్ 2012

Our Relationship is Beautiful

సూర్యుడి వెలుగు అనంతం,
శివుడి మూడోకన్ను  అతీతం,
వినాయకుని తొండం అద్వితీయం,
ఆంజనేయుని తోక అద్భుతం,
నాన్న కోపం అక్షర సత్యం,
అమ్మ ప్రేమ అపరిమితం,
అక్క ఆప్యాయత అపురూపం,
తమ్ముడి అలక అరక్షణం,
మన స్నేహం మన జీవితానికి అందం, ఆనందం.

17 నవంబర్ 2012

Nandi Hills - నంది కొండలు


మేఘాలు కొండలను ముద్దాడుతుంటే,
ఆకాశం భూమిని హత్తుకుంటుంటే..
పొగమంచు చెవిని తాకుతుంటే..
ఒంటిమీది రోమాలు నిలబడి నాట్యం చేస్తుంటే..
ప్రకృతి అందాలు అలరిస్తుంటే,
జంతువుల అల్లరికి ఒళ్ళు పులకరిస్తుంటే..

అంతకన్నా అందమెక్కడుంటుంది
ఆనందం ఎక్కడ దొరుకుంతుంది...

అదే భూతల స్వర్గం 'నంది కొండలు'

13 నవంబర్ 2012

Happy Diwali - దీపావళి శుభాకాంక్షలు


దీపాల వెలుగులు మీ జీవితలంలోని చీకటిని పారద్రోలాలని,
తారాజువ్వలు మీ 'కీర్తి'ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాలని,
టపాకాయల శబ్ధం మీలోని మౌనాన్ని చేధించాలని,
రంగులు మీ జీవితాన్ని అందంగా, ఆనందంగా చేయాలని,

కోరుకుంటూ
నీకు మరియు మీకుటుంబ సుభ్యులకు 'దీపావళి శుభాకాంక్షలు'

ఇట్లు,
మీ  విశ్వనాధ్

11 నవంబర్ 2012

భక్తి - ప్రేమ


ఒకడు పొరుగు దేశాన్ని తిడితే, వాడికి మన దేశం మీద భక్తి ఉన్నట్లు కాదు,
పక్కవాడి గురించి చెడుగా మాట్లాడితే, మనమీద ప్రేమ ఉన్నట్లు కాదు.

27 అక్టోబర్ 2012

I am the Indian - నేను భారతీయ యువకున్ని

చచ్చిపోను నేను చవట సన్నాసిలా,
బతకను నేను చేతకాని దద్దమ్మలా...

నింగి అంచును చేరుకుంటా నా కాళ్ళతో,
చందమామను అందుకుంటా నా చేతులతో.

మద్యం మత్తుకు బానిసను కాను,
డబ్బుకు లొంగను నేను.

కొండనైన పిండి చేస్తా, నా కండ బలంతో,
బండనైన కరిగిస్తా, నా బుడ్డి బలంతో.

మనిషిని మారుస్తా నా మాటలతో,
మనసును గెలుస్తా నా మనసుతో.

ఉగ్రవాది కాదు నేను, ఉన్మాది కాదు నేను,
పైశాచిని కాదు నేను, తీవ్రవాది కాదు నేను,

అచ్చమైన, స్వచ్చమైన భారతీయ యువకున్ని.
పదిమందికి సాయం చేస్తా,
వందమందికి ఒక్కడినవుతా.
సహనంతో సాధిస్తా,
నేర్పుతో నేగ్గుకోస్తా.

29 సెప్టెంబర్ 2012

I am Toughest Guy

రాయితో కొడితే రాలిపోయే చింతకాయను కాదు నేను,
కాలితో మట్టిలోకి తోక్కేస్తే కూడా మొలకెత్తే విత్తనం నేను.

18 ఆగస్టు 2012

One smile - which costs nothing.

one smile of salesperson, make one more sale,
one smile of busy person, gets them relief,
one smile of a Senior, encourages a junior,
one smile partner, removes egos between a couple,
one smile from doctor, increases patient's confidence,
one smile of a kid, makes the parents forget everything,
One smile from you, gives me unlimited Happiness.

08 ఆగస్టు 2012

walking in the rain on beach

సముద్రపు హోరు చెవిని తాకుతుంటే,
అలలు కాళ్ళను తడుపుతుంటే,
చిరుజల్లులు కురుస్తూ ఉంటే,
ప్రియనేస్తం పక్కనే ఉంటే,
కాలమెంతో తెలియదు,
దూరమెంతో కనపడదు.
తీరం అంతు కనపడదు

04 ఆగస్టు 2012

Friendship is combination of Good and bad

నష్టం వచ్చిందని వ్యాపారం వదిలేస్తామా?
వ్యాపారం లాభనష్టాల  సమరం.
కష్టం వచ్చిందని  జీవితాన్ని బలితీసుకుంటామా?
జీవితం   కష్టసుఖాల పయనం.
తప్పు చేశారని స్నేహాన్ని మరువగలమా?
స్నేహం తప్పొప్పుల  సమాహారం.

08 జులై 2012

The Way of Understanding

Some calls me as Joker,
Some calls me as Fun-maker.

some calls me as Dumb-minded,
some call me as Talented.

some call me as Mental,
some call me as Gentle.

whatever you called me its Correct in your angle,
but I am the Perfect in my angle.

Its all depends upon your way of understanding.

29 జూన్ 2012

Suggestion - Decision

Anyone can give me suggestion,
but No one could affect my Decision.

Peace in mind brings success

నడవడికలో నిజాయితీ,
ఆలోచనల్లో స్పష్టత,
మనస్సులో ప్రశాంతత,
గుండెల్లో స్థైర్యం ఉంటే ,
కళ్ళల్లో తేజస్సు,
పెదలపైకి చిరునవ్వు,
పనుల్లో వేగం.
ఫలితాల్లో ఖచ్చితత్వం వాటంతట అవే వస్తాయి .

Getting Knowledge

తెలియనిది తెలుసుకోవడం  తప్పులేదు,
తెలియకపోయినా వాదించడంలో అర్థం లేదు.

14 జూన్ 2012

ఎల్లప్పుడూ నాతోనే ఉన్నందుకు కృతజ్ఞతలు- Thankyou for being with me forever

నా తల్లిదండ్రుల ఆశీస్సులు ,
తోబుట్టువుల ఆప్యాయత,
బంధువుల అనురాగం ,
స్నేహితుల అభిమానం,
 శ్రేయోభిలాషుల మద్దతు ,
ఇవే నేనెప్పుడు కోరుకునేవి.
నాకు ఎల్లప్పుడూ లభించేవి.
మీ ప్రేమ నాతో ఎప్పుడు ఉంటే ,
నేను ప్రపంచాన్నే జయిస్తా!
సమయాన్నే శాసిస్తా!!

ఎల్లప్పుడూ నాతోనే ఉన్నందుకు కృతజ్ఞతలు ,
ఇలాగే నాతోనే ఎప్పటికీ ఉంటారని ఆశిస్తూ 
ఇట్లు ,
మీ మిత్రుడు శ్రేయోభిలాషి,
విశ్వనాథ్ .

17 ఏప్రిల్ 2012

Wherever you go - my soul is with you only

Wherever you go - my soul is with you only
You could stop talking to me,
but you cannot stop yourself from inspiring me.
You would have forget me,
but you cannot stop me thinking about you.
You could walk away from me,
but you cannot take my memories away.
You could avoid your shade by walking into the darkness,
but you cannot stop my soul from following you everywhere.
You could wish to avoid me ever,
but I am your well wisher forever.......

03 ఏప్రిల్ 2012

పొట్టకూటి కోసం పట్టణాల వైపు చూపు - Job searching in cities

పొట్టకూటి కోసం పచ్చని పల్లెటూళ్ళు వదిలి,
వెచ్చని పట్టణాలకు పరుగెత్తుకు వచ్చాము.
పారిపోము మేము ఎంత కష్టము  వచ్చినా,
బెదిరిపోము మేము ఎంత నష్టము వచ్చినా,
సాధించి తీరుతాము అనుకున్న లక్ష్యాన్ని,
భువికి దించుతాము అందమైన  స్వర్గాన్ని.

27 ఫిబ్రవరి 2012

ఆరోగ్యమే మహాభాగ్యం - Health is Wealth

Hitech-city వెళితే అక్కడ ఉద్యోగులను,companyలను చూసి,
ఒక software job కావాలనిపిస్తుంది.
RTC 'X' Roads వెళితే అక్కడ Govt. ఉద్యోగార్తులను(అభ్యర్థులను) చూసి,
ఒక Govt. ఉద్యోగం కావాలనిపిస్తుంది.
Banjara Hills వెళితే అక్కడ దర్జాలు చూసి,
కనీసం ఒక పెద్ద Building, ఖరీదైన car కావాలనిపిస్తుంది.
Ameerpet వెళితే అక్కడ అందమైన అమ్మాయిలను చూసి,
ఒక Girl Friend కావాలనిపిస్తుంది.
కాని ఏదైనా hospital కి వెళ్ళితే అక్కడ patients ను చూసి,
అవన్నీ ఏమి వద్దు రా దేవుడా..... ఆరోగ్యం బాగుంటే చాలు  అదే పదివేలు అనిపిస్తుంది.

25 ఫిబ్రవరి 2012

Pure Telugu Girl - పదహారణాల తెలుగు అమ్మాయి

Theme: తన పదహారణాల తెలుగు ప్రేయసిని, ప్రియుడి వర్ణన (A boy describing his lover's(pure telugu girl) beauty in poetic way.)

బొట్టునైన కాకపోతిని,
విశాలమైన ఆకాశం లాంటి నీ నుదుటి పై చందమామ లా వెలిగిపోడానికి.
పుట్టుమచ్చనైనా కాకపోతిని,
పదికాలాలపాటు మేలిమి బంగారపు నీ ఒంటిని అతుక్కుపోడానికి.
ముక్కుపుడకనైనా  కాకపోతిని,
నీ వెచ్చని శ్వాసను ఆశ్వాదించడానికి.
పెదవి రంగునైన కాకపోతిని,
నీ ఆధారాల అందములో తడిసిమువ్వడానికి.
చేవిపోగునైన కాకపోతిని,
అందమైన నీ చెవులను అన్తిపెట్టుకుంటూ ఉండడానికి.
శిరభారణమునైన కాకపోతిని,
నీ హృదయపు లయను వింటూ బతికేయడానికి.
వడ్డానమునైనా కాకపోతిని,
సూక్ష్మమైన నీ నడుముని చుట్టేయడానికి.
గాజులనైనా కాకపోతిని,
సున్నితమైన నీ హస్తములు చేసే పనులకు సవ్వడి చేస్తూ మద్దతివ్వడానికి.
కాలి మువ్వలనైన కాకపోతిని,
నీ పాదపు ప్రతి అడుగునూ అనుసరించడానికి.
పవిటనైనా కాకపోతిని,
పదహారణాల నీ పరువాన్ని దాచుకోడానికి.




22 ఫిబ్రవరి 2012

Love - ప్రేమ - प्यार

నేను చనిపోయాక నామీద నీకు కలిగే గంపెడు జాలికంటే,
నేను బతికుండగా నామీద నీకుండే గుప్పుడే ప్రేమే నాకు కావాలి.

09 ఫిబ్రవరి 2012

ఎన్నికల భారతీయం - Elections in India is a Business

ఎన్నికల భారతీయం - Elections in India is a business
Theme: I am writing my view on dark side of the Elections in India in a poetic way.

కుల మతాల చిచ్చు పెట్టి,
ప్రాంతాల పేర్లు చెప్పి,
డబ్బును పంచిపెట్టి,
మంచిని మరుగున పెట్టి,
మద్యాన్ని పారించి,
ప్రజల స్వేచ్చను హరిస్తూ,
హక్కులను లాక్కుంటూ,
అభివృద్దిని అడ్డుకుంటూ,
మాధ్యమాలకు వెలకట్టి,
ఉచితానుచితా ప్రకటనలు చేస్తూ,
భవిష్యత్తును కాలరాస్తూ,
ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టి,
కోట్లను దండుకోవడం కోసం,
ఓట్లను గుంజుకునే నాటకమే  'ఎన్నికలు'

06 ఫిబ్రవరి 2012

సంతోషమే సగం బలం - Happiness - Success

"సంతోషమే సగం బలం" అన్నారు పెద్దలు...ఆ మాటను గుర్తు చేసుకుంటూ నా అనుభవాన్ని తలచుకుంటూ నేను రాసుకున్న మాట ఇది...


Success may bring you Happiness,
But Happiness always brings you Success.

So be happy always and
chill out every moment,
cheer up every second.